ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఈ ఉగాది నాడు తప్పనిసరిగా నిర్వహించే కార్యక్రమాలలో ఉగాది పచ్చడి, పంచాంగ ప్రశణాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి.
జ్యోతిషం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు. చాంద్రమానంలో పూర్ణిమ నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసాల పేర్లు పెట్టబడుతుంటాయి. చిత్త పూర్ణిమ నాడు వస్తే చైత్రం. విశాఖ -పౌర్ణిమ నాడు వస్తే వైశాఖం… ఇలా రాని సమయంలో అధిక మాసం లేదా క్షయమాసాలు మనకు వస్తూంటాయి..సంవత్సరకాలానికి సంబంధించిన మన భవిష్యత్ ను గురించి గ్రహాల కదలిక, పుట్టిన రాశి, నక్షత్రాన్ని బట్టి లెక్కగట్టి చెబుతారు పండితులు. తమ తమ రాశుల ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఆతృత అందరికీ ఉంటుంది. ఇదిగో క్రింది పట్టికలో…. నూతన సంవత్సరానికి సంబంధించి…మీ రాశి ప్రకారం మీ ఆధాయ వ్యయాలు…రాజాపూజ్యం, రాజావమానాల గురించి క్లుప్తంగా ఇవ్వబడింది.
1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.
శుభకృతు నామ సంవత్సర ఉగాది 2022 ఆదాయ వ్యయాలు