కోకోనట్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో. కొబ్బరి మనకు చేసే ఉపయోగాలు ఇన్ని అన్నీ కావు అలాంటి కొబ్బరి కోసమంటూ ఒకరోజు ఉందని అది సెప్టెంబర్ 2 అని మీలో ఎంతమందికి తెలుసు. అవునండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండో తారీకు న వరల్డ్ కోకోనట్ డే గా సెలబ్రేట్ చేస్తారు. ఆసియా మరియు కొన్ని పశ్చిమ దేశాలలో ఈ వరల్డ్ కోకోనట్ డే ని గమనిస్తారు ఎందుకనగా ప్రపంచానికి అధిక మొత్తంలో కోకోనట్ ని అందించే దేశాలు ఇవే కనుక. ఈ వరల్డ్ కోకోనట్ డే ని ప్రజలలో కొబ్బరి పట్ల అవగాహన కల్పించడం కోసం పారిశ్రామికంగా దానీ ఉపయోగాలను తెలియజేయడం కోసం జరుపుతూ ఉంటారు. మన రోజువారీ జీవితంలో కొబ్బరి నీ ఎన్నోరకాలుగా వాడుతూవుంటాము కొబ్బరి నీరు తాగేందుకు కొబ్బరి ముక్కలను తినేందుకు రకరకాల వంటలు చేసుకునేందుకు, కొబ్బరి నూనె కోసం ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి కొబ్బరి మనకు చేసే కొన్ని రకాల ఉపయోగాలు గురించి వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా తెలుసుకుందాం.
కొబ్బరి లో ఉండే యాంటి మైక్రోబియల్ వల్ల కొన్ని రకాలైన సమస్యలను ఇది నివారించగలదు కొబ్బరిని తినడం వల్ల పళ్ల మధ్య ఉండే హానికరమైన క్రిములను సంహరిస్తుంది పళ్ళ యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది
కొబ్బరి లో ఉండే ఫ్యాట్ అనేది మిగిలిన రకాల ఆహారాలతో పోలిస్తే చాలా సులభంగా శరీరం జీర్ణం చేసుకోగలదు కొబ్బరి యొక్క ఫ్యాట్ లో క్యాలరీలు మరియు కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల స్వచ్ఛమైన కొబ్బరి నుంచి తీసిన నూనెను వంటలలో ఉపయోగించినట్లయితే పొట్టను తగ్గించుకోవచ్చు మరియు గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.అంతేకాక కొబ్బరి లో ఉండే తక్కువ క్యాలరీస్ వల్ల ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.లేత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది.