ప్రపంచ దేశాలని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజల కష్టాలు వర్ణనాతీతం..లాక్ డౌన్ కారణంగా యావత్ ప్రజానికం ఇళ్లకే పరితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది..ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలని …ప్రజానికాన్ని కుదిపేస్తున్న ఈ మహమ్మారి వలన ఎందరో పని లేకుండా అలమటిస్తున్నారు..చిన్న పెద్ద తేడా లేకుండా, ప్రతి ఒక్కళ్లని పట్టి పీడిస్తుంది..కరోనా మహమ్మారి..ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.
తనకు సంబందించిన భూముల్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ వారి పంట కోతల తరువాత వడ్లను తూర్పూరపడుతూ ఒక వీడియో ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్ ఇంట వైరల్ గా మారింది జబర్దస్త్ లోని చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ టీంలలోనే కాకుండా..ప్రముఖ టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొదుట తాను సంగీత దర్శకుడిగా ఎదగాలి అనుకున్నారట.ఇప్పటికి ఆ కోరిక బలంగానే ఉందట ఎప్పటికైనా మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటానని పలు ఇంటర్వ్యూ లలో తెలిపారు.