కేంద్ర ప్రభుత్వం మే 4 నుంచి మరో 14 రోజులు అంటే మే 17 వరకూ ఈ మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతుంది.
కోవిద్-19 దెబ్బకు ప్రవేశ పరీక్షలన్ని రద్దయ్యాయి .అయితే వాయిదాపడ్డ ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం పరీక్షా తేదీలను వెల్లడించారు.
జులై 18 నుంచి 23 వరకు, మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ జులై 26 న నిర్వహించనున్నట్లు కేంద్ర హెచ్చార్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ప్రకటించారు. ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక జులై 26న నీట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు.పెండింగ్ లో ఉన్న సీబీఎస్సీ 10, 12 బోర్డు పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.నీట్ పరీక్ష 15 లక్షల మంది, జేఈఈ–మెయిన్స్ రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు.