Rashi Phalalu Today : Horoscope Today in Telugu, రాశి ఫలాలు, 11.08.2021ఇవాళ అనగా 11 వ తారీఖు, ఆగష్టు నెల 2021 వ సంవత్సరం పన్నెండు రాశుల వారికి ఎలా ఉందొ తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటి పనులు చేయకూడదు వాటిని ఆచరిద్దాం.
మేష రాశి: వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి. ఒక శుభవార్త మిమల్ని ఆనందింప చేస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృషభ రాశి: ఇవాళ వ్యాపారాలు పూర్తి లాభ సాటిగా ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం, ఉద్యోగస్తులకు పనుల్లో మరింత శ్రమ తప్పదు, మీ దగ్గరి బంధువుల నుంచి కొన్ని సమస్యలు తప్పవు.
మిథున రాశి: ముఖ్యమైన పనుల్లో మీ బంధువుల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి, వ్యాపారం, వృత్తి లో మీరు మరింత కష్టపడి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనూహ్యంగా కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి: ఉద్యోగస్తులకు పూర్తి అనుకూలం, ఎవరైతే మంచి ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి,ఆర్థికంగా మరింత పురోగతి, ఆరోగ్యం పర్వాలేదు.
సింహ రాశి: మీ దృఢ సంకల్పంతో కొన్ని పనులు అనుకున్న సమయం లో పూర్తి చేస్తారు, వృథా ఖర్చులు, స్నేహితుల మధ్య విబేధాలు తప్పవు, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తునంరో వారికీ మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులు అనుకూలం.
కన్య రాశి: నిరుద్యోగులు శుభవార్త వింటారు, మీకు రావాల్సిన డబ్బు తప్పక సమయానికి చేతికి అందుతుంది, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, మీ దృఢ సంకల్పంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.
తుల రాశి: అనారోగ్య సూచనలు ఉన్నాయి, ఇంట బయట పూర్తి ఒత్తిళ్లు తప్పవు, వ్యాపారస్తులకు మరిన్ని ఖర్చులు తప్పవు, కీలక నిర్ణయాలు, పనులలో బాగా అలోచించి ముందుకెళ్లడం మంచిది.
వృశ్చిక రాశి: ఆదాయం అనుకూలం, అనుకోని ఆర్థిక సమస్యలు తప్పవు, కుటుంబంలో ప్రశాంతత కరువు, వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ముందకెళ్ళడం మంచిది. సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు రాశి: ఇవాళ మీకొక అనుకోని శుభవార్త. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది అనుకూల సమయం, ఉద్యోగస్తులకు మీ పనికి తగ్గ ఫలితం తప్పక ఉంటుంది.మీ స్నేహితుల నుంచి మీకు నష్టం తప్పదు.
మకరం రాశి: సమాజంలో మీకు మరింత గౌరవ మర్యాదలు లభిస్తాయి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి, మీ బాధ్యతలు సమర్థవంతగా పూర్తి చేసుకుంటారు, ఇవాళ మీకొక శుభవార్త.
కుంభం రాశి: ఇవాళ గొడవలకి దూరంగా ఉండటం మంచిది, ఆదాయం లో ఒడిదుడుకులు తప్పవు, ఆర్థిక సహాయం చేస్తారు, కుటుంబ సభ్యులతో విబేధాలు తప్పవు.
మీనం రాశి: దృఢ సంకల్పంతో మీ పనులు పూర్తి చేస్తారు, ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రత్నాలు ఫలిస్తాయి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.