ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం, ppp ( పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ ) తో 28 నవంబర్ 2017 నా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి చేతులమీదుగా ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇది
దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా L & T సంస్థ నిర్మాణం చేపట్టింది. దీనికి మొదటి గా అనుకున్న బడ్జెట్ 16 వేల కోట్లు కాగా అది తరువాత 18 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినప్పటికి L & T సంస్థ ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా అప్పులు తెచ్చి మరీ ఈ నిర్మాణాన్ని కొనసాగించింది. ఈ హైదరాబాదీ మెట్రో ట్రైన్ దేశంలోనే రెండవ అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు గా నిలిచింది మొదటి స్థానంలో ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ నిలిచింది. అనుకున్న విధంగానే హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రజల నుంచి చాలా ఆదరణను పొందింది .
ఈ మెట్రో ట్రైన్ ను ప్రారంభించిన తక్కువ కాలంలోనే దీనిలో ప్రతిరోజూ సగటున ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య 3 నుంచి 4 లక్షల వరకూ ఉండేది L & T సంస్థ లాభాలను ఆర్జించడానికి ప్రారంభించింది ఇదే విధంగా కొనసాగితే ఉన్నట్లయితే ఎల్ అండ్ టి సంస్థ ఇంకా ఎన్నో లాభాలను మెట్రో ట్రైన్ నుంచి పొందే ఉండేది కానీ కరోనా మహమ్మారి వల్ల ఇంచుమించు ఆరు నెలల కాలం మెట్రో ట్రైన్ లు కేవలం స్టేషన్ కి మాత్రమే పరిమితమై ఉండిపోయాయి దీనివల్ల లాభాలలో నడుస్తున్న సంస్థ ఒక్కసారిగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది ప్రస్తుతం మెట్రో ట్రైన్ లు తిరుగుతున్నప్పటికి ఆశించినంత స్థాయిలో ప్రయాణికుల సంఖ్య లేకపోవడంవల్ల నష్టాలని చూడాల్సి వస్తుంది ఇప్పటికే పెరుగుతున్నా అప్పుల భారంతో నష్టాలలో మెట్రోని ఇలానే నడపడం సంస్థకు భారంగా ఉంది. దీనితో L & T సంస్థ మెట్రోలో తమ వాటాలను అమ్మడానికి నిర్ణయించుకుంది.