టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన ‘దగ్గుబాటి రానా’ తన లవ్ మిహికా గురించి చెప్పి అందరికీ పరిచయం చేస్తూ పెద్ద షాక్ ఇచ్చారు..వారి ఇరువురి కుటుంబాలలోని పెద్దలు ఒకే చెయ్యడం తో .మొన్నీమధ్యే ‘రోకా’ వేడుకని ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.ఉత్తరాదిన ఈ వేడుకని ‘మాట మంతి’ లాగ చేస్తారట.మరి వీరి పెళ్లి రోజు ఎప్పుడంటూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి పెళ్లి డేట్ ని అధికారికంగా ప్రకటించారు ఆగష్టు 8 హైదరాబాద్ లోనే శుభకార్యాన్ని జరపబోతున్నారు.
అది కూడా పరిమిత సంఖ్యలోనే ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య మార్వాడి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహం జరుగబోతోంది.కోవిడ్-19 నిబంధనలకు లోబడే పరిమిత సంఖ్యలో అతిధులు ఉండేలా చూస్తున్నారు. వివాహానికి రెండు రోజులు ముందు అంటే 6 ,7 తేదీలలో వేడుకలు జరగబోతున్నాయట.మిహికా రానా ఇద్దరు మంచి స్నేహితులు ఈ మద్యే వీరివురు ప్రేమికులుగా మారారు..టాలీవుడ్ లో మళ్ళీ చాల కాలం తరువాత పెళ్లి సందడి మొదలైనది ఇటీవలే….నిఖిల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే ..మరో హీరో నితిన్ వివాహం కూడా జరగాల్సి ఉండగా కోవిడ్-19 వలన అది కాస్త వాయిదా పడింది..పెళ్లిని డిసెంబర్ కి వాయిదా వేసినట్టు చెబుతున్నారు