Bheemla Nayak: భీమ్లా నాయక్ రికార్డుల మోత మొదలయింది ! : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాణా దగ్గుబాటి విలన్ గా రానున్న సినిమా ‘బీమ్లా నాయక్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని ఆగష్టు 15 సందర్బంగా నిన్న విడుదల చేసారు. ఈ టీజర్ లో పవర్ స్టార్ తన పవర్ ఫుల్ పెరఫామెన్స్ ని చూపించారు.
చాల కాలం తరువాత పవన్ ని మాస్ క్యారెక్టర్ లో అద్దిరిపోయే పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక ఈ ‘భీమ్లా నాయక్’ యు ట్యూబ్ రికార్డుల విషయానికి వస్తే 24 గంటలు గడిచే సరికి పది మిలియన్ ల వ్యూస్ సాధించింది. గత రికార్డు గా ఉన్న రాధే శ్యామ్ సినిమా ని దాటుకుంటూ ఫస్ట్ పొజిషన్ లో నిలిచింది. ఇక ఈ సినిమా ని సంక్రాంతికి మన ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు టీం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ని పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున విడుదల చేయనున్నారు.