జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఇది రెండు జీవితాలను కలిపే బంధం. పెళ్లయిన తర్వాత ఇద్దరు కలిసిమెలిసి జీవిస్తే కుటుంబం ఆనందంగా, అందంగా ఉంటుంది అందుకు ప్రధానంగా భార్య నేర్చుకోవాల్సిన 5 మంచి లక్షణాలు ఏంటంటే…ఏ సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా దాని అర్థం చేసుకుంటే వారి సంసార జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి బాధ్యత ఎక్కువ భార్య పైనే ఆధారపడి ఉంటుంది.
అయితే సమస్యలు అర్థం చేసుకోవడం, సంసారాన్ని ఆనందంగా మలుచుకోవడం అనేది పాత రోజుల్లో బాగానే ఉంది ఆ తర్వాత కాలం మారింది. మహిళలకు బయటపని ఒత్తిడి పెరగడంతో సర్దుకుపోయే స్వభావం తగ్గింది. అర్థం చేసుకునే ఓపిక నశిస్తూ వస్తుంది.ఆడవాళ్లు బయట పని చేసిన ఇంటి బాధ్యతను వదులుకోరు.
మంచి భార్య ఏ లక్షణాలు కలిగి ఉంటుందో, అసలు ఒక భర్త తన భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అని కోరుకుంటాడో ముఖ్యంగా తెలుసుకోవాలి…
1.
భార్యకు చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆమెకు చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించడానికి సహనం అవసరం.
2.
భర్త కూడా ఫ్యామిలీని బాగా చూసుకోవడం కోసమే కష్టపడతాడు కాబట్టి బయట కష్టపడి ఎంతో ఒత్తిడితో ఇంటికి వచ్చిన భర్తతో చిన్న చిన్న విషయాలకు గొడవ పడకూడదు. అర్థం చేసుకుని అందుకు అనువుగా నడుచుకోవాలి.
3.
ఎక్కడైనా భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనిచేస్తున్న లేదంటే ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అలాంటి సమయంలో డబ్బు విషయంలో భార్య ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భర్తతో మాట్లాడటం మంచిది.
4.
ముఖ్యంగా భార్య చేతి వంట రుచి బయట దొరకదు కాబట్టి భర్తకు నచ్చిన వంటకాలు చేసి తృప్తి పరచడం భార్య బాధ్యత.
5.
ఎక్కువ మంది మహిళలు, గృహిణిలు ఇంటి బాధ్యత తీసుకోవడానికి, ఇంట్లో ఖర్చులు ఆదాయం లెక్కలు చలాయించడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి కుటుంబంలో తలెత్తే సమస్యలను పరిష్కరించే సత్తా ఉండాలి.అర్థం చేసుకునే మహిళనే అర్ధాంగి అని అంటారు. మహిళలకు కుటుంబ బాధ్యతలతో పాటు భర్త యోగ క్షేమాలు, సుఖసంతోషాలు చూడాల్సిన ప్రధాన కర్తవ్యం ఉంటుందని గ్రహించాలి. ఈ ఐదు లక్షణాలను మనలో ఉంచుకుంటే మన సంసార జీవితం ఎటువంటి చీకు చింతా లేకుండా హాయిగా కొనసాగుతుంది.
Also Read:వైయస్ షర్మిల “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?