ఇండియన్ సినిమాలో రకరకాల జోనర్ల సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సీనియర్ హీరోలు అందరూ కూడా తమ పంథా మార్చేశారు. ఇప్పుడు అందరూ కూడా వయసుకు తగ్గ పాత్రలు ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాలో తాత క్యారెక్టర్ చేసాడు. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కూడా అదే తరహా పాత్రను చేశాడు. కానీ రజిని, కమల్ హాసన్ వయసు ఉన్న తెలుగు హీరోలు మాత్రం ఇంకా కుర్ర హీరోలు లాగ ఫీల్ అవుతున్నారు.
వయసుకు తగ్గ పాత్రలు చేస్తేనే కదా… ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసేది. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా లియో సినిమాలో ఒక కొడుకుకి, కూతురికి తండ్రిగా నటించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా టైగర్ 3 సినిమాలో తండ్రి పాత్రలో నటించాడు. బాలీవుడ్, కొలీవుడ్ లో స్టార్ హీరోలకు లేని ఇబ్బంది మన తెలుగు హీరోలకి ఎందుకు వస్తుంది అంటూ తెలుగు ఆడియోస్ కామెంట్ చేస్తున్నారు.

మన తెలుగులో చూసుకుంటే తాజాగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించాడు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక కూతురుని పెంచే పాత్రలో నటించాడు. తీరా చూస్తే ఆమె అతని సొంత కూతురు కాదు. నాన్న అని పిలిపించుకోకుండా చిచ్చా అంటూ పిలిపించేలా డైరెక్టర్ సినిమాని తీశాడు. బాలకృష్ణ సొంత కూతురుగా చూపిస్తే ఏమి అడ్డం వస్తుందో అర్థం కావడం లేదు. ఇంకా మన హీరోలు రియాల్టీని అర్థం చేసుకోకపోతే చేసేది ఏమీ లేదు.

తండ్రి పాత్ర చేస్తే ఏం అడ్డం వస్తుంది. ఇంక కుర్ర హీరోయిన్ల పక్కన చిందులు వేయడం ఆపేసి హుందాగా మంచి మంచి పాత్రలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. తెలుగులో కూడా కొందరు యంగ్ హీరోలు తండ్రి పాత్రలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అలా చూసుకుంటే నాని ముందు వరుసలో ఉంటాడు. నాని తాజా చిత్రం హాయ్ నాన్న లో ఒక కూతురికి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. మన యంగ్ హీరోలను చూసైనా సరే మన సీనియర్ హీరోలు మారాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read:నిన్నటి నుండి ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు..! ఈమె ఎవరంటే..



15 నుంచి 25 ఏజ్ లో యువ రక్తంతో ఉరకలు వేస్తారు.. ఇంకా వయసు పెరిగే కొంచెం కొంచెం మనలో మార్పులు చాలా జరుగుతాయి.. ఎత్తు తగ్గడం అనేది ఇందులో ముఖ్యమైంది. అయితే దీనికి ప్రధాన కారణం జన్యు లోపం అనుకుంటారు. కానీ అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి 18-20 ఏండ్ల వరకు మాత్రమే ఎత్తు పెరుగుతారు.
ఆ తర్వాత మనం ఎంత ఎత్తు పెరిగితే అంతే ఎత్తుతో 30-40 ఏండ్ల వరకు ఉంటాం. ఆ తర్వాత ఏజ్ లో తగ్గడం మొదలవుతుంది. సైన్స్ ఏ బి సి నివేదిక ప్రకారం చూస్తే.. ఈ వయసు తర్వాత వృద్దాప్యానికి సంబంధించిన అన్ని ప్రభావాలు శరీరంపై కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎత్తు ఉంటుంది. ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత శరీరం కుచించుకుపోవడం స్టార్ట్ అవుతుంది..
30-40 ఏండ్ల మధ్యలో ఎత్తు తగ్గడం ప్రారంభమై 10 సంవత్సరాల పాటు తగ్గుతుంది.. ఒక వ్యక్తి తన పొడవులో పాదాలు, ఎముకలు, పుర్రె పై ఎటువంటి ప్రభావం చూపదు. కానీ వెన్నుపాము పొడవు మాత్రం తగ్గడం ప్రారంభం అవుతుంది. దానిలో ఉన్నటువంటి డిస్క్ సన్నబడడం మొదలవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ మన పొడవు పైనే పడుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి.. అవి ఖనిజ లవణాల కొరత వల్ల సన్నగా మారడంతో వాటి పరిమాణం తగ్గడం మొదలవుతుంది.
దీంతో పాటుగా పాదాల్లోని 2 ఎముకల మధ్యలో కదలికలను సులభతరం చేసే లిగమెంట్ కూడా బలహీనంగా అవ్వడం ప్రారంభమవుతాయి. పురుషులు గానీ స్త్రీలు గానీ ఏజ్ పెరిగే కొలది ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది.. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఎత్తు తగ్గుతారు. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.