నిత్య మీనన్ నటించిన “మాస్టర్ పీస్” చూశారా..? ఎలా ఉందంటే..?

నిత్య మీనన్ నటించిన “మాస్టర్ పీస్” చూశారా..? ఎలా ఉందంటే..?

by Mounika Singaluri

Ads

మలయాళీ ముద్దుగుమ్మ నిత్య మీనన్ తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు నిత్య మీనన్ నటించిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఎలా ఉందంటే…

Video Advertisement

కథక చూస్తే కేరళలోని కొచ్చికి చెందిన రియా (నిత్యమీనన్) బినోయ్ (షరఫ్ ఉద్దీన్) ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఓ అపార్ట్మెంట్ లో వేరే కాపురం కూడా పెడతారు. అందరూ ఆలుమగలుల వీరి మధ్య కూడా అప్పుడప్పుడు టామ్ అండ్ జెర్రీల వారు నడుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బినోయ్, రియా పేరెంట్స్ అక్కడ ఏదో పెద్ద యుద్ధం జరిగిపోతుందని భావిస్తారు.

ఆ తగాదాలకు పరిష్కారం చూపి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో తమ పిల్లలనుండి వారు తెలుసుకున్న షాకింగ్ విషయం ఏంటి? చివరికి వారి ప్రయత్నం ఫలించిందా లేదా అన్న కథాంశంతో వెబ్ సిరీస్ రూపొందింది.కొత్తగా పెళ్లయిన దంపతులు వారి మధ్య గిల్లికజ్జాలు చివరకు సమస్యల పరిష్కరించుకొని మునిపటిలా ప్రేమలో ఉండటం. ఇలాంటి కథలు మనకి కొత్త ఏమీ కాదు. ఎన్నో చిత్రాల్లో కనిపించే కాన్సెప్టే మాస్టర్ పీస్ లో కూడా కనిపిస్తుంది.అయితే దాన్ని ఎమోషనల్ గా కాకుండా వినోదాత్మకంగా తెరకెక్కించారు దర్శకుడు శ్రీజిత్. కదంతా దాదాపు ఓకే ఇంట్లో ఆరు పాత్రల మధ్య తిరుగుతుంది. ఈ కథను బాగా సాగదీసి చెప్పారు.

రియా- బినోయ్ ల మధ్య చోటుచేసుకునే గొడవలు అదే ఇంట్లో ఉంటూ రియా తండ్రి తండ్రులు ఆమె అత్తమామలు చేసే హంగామా ఓ స్థాయి వరకు ఆకట్టుకుంది గాని ముందుకు వెళ్లే కొద్దీ రొటీన్ అనిపిస్తుంది. అత్తా కోడళ్ళ మధ్య సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ తల్లిదండ్రుల పాత్రలు బాగా గిలిగింతలు పెడతాయి.ఈ కథను ఎంటర్టైనర్ గా నడుపుతూ ప్రీ క్లైమాక్స్ లో కాస్త ఎమోషన్ జోడించారు. కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్యన్ కాదు ఎన్నేళ్ల బంధమైనా భార్యాభర్తల మధ్య చిరుబుర్రులు ఉంటాయని భార్య కన్న కలలను నిజం చేసేందుకు భర్త సహకరించాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో కామెడీ ప్రధాన బలం. కొన్నిచోట్ల పడి పడి నవ్వుతారు.

ఇక నటన విషయానికొస్తే నిత్యమీనన్ ఒదిగిపోయారు. వినయ్ పాత్ర చేసిన అతను కూడా ఆకట్టుకుంటాడు. ప్రియా అత్త పత్ర పోషించిన మాల పార్వతి కామెడీ సీరీస్ కు ప్రత్యేక ఆకర్షణ. ప్రియ మామగా రంజీ ఫనిక్కర్, ఆమె తల్లిగా శాంతి కృష్ణ, తండ్రిగా అశోక్ పరిధి మేరకు నటించారు.ప్రవీణ్ రాసిన కథను తనదైన శైలిలో తెరపైకి తీసుకువచ్చి ప్రేక్షకులను నవ్వించడంలో శ్రీజిత్ కు మంచి మార్కులు పడ్డాయి. సంగీతం ఓకే, సినిమాటోగ్రఫీ బాగుంది. సిరీస్ మొత్తం ఒక డిఫరెంట్ థీమ్ లో నడుస్తుంది. ఎడిటింగ్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది.

కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్యన్ కాదు ఎన్నేళ్ల బంధమైనా భార్యాభర్తల మధ్య చిరుబుర్రులు ఉంటాయని భార్య కన్న కలలను నిజం చేసేందుకు భర్త సహకరించాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమాలో కామెడీ ప్రధాన బలం. కొన్నిచోట్ల పడి పడి నవ్వుతారు.ఫైనల్ గా ఈ సినిమాని పెళ్లయిన వారు, పెళ్లి కాని వారు ,పెళ్లి చేసుకోబోతున్నవారు ఇలా అందరూ చూడొచ్చు. చాలా రోజుల తర్వాత కుటుంబమంతా కలిసి చూస్తూ ఉన్న హాయిగా నవ్వుకోవాలి అనుకుంటే ఈ మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ మంచి ఎన్నిక.

Also Read:టైగర్ నాగేశ్వరరావు కోలుకున్నట్లేనా…? పూర్తి రిజల్ట్ ఏంటి…!


End of Article

You may also like