ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక పిల్ల కూనగా మాత్రమే చూసేవారు. ఈ సీరీస్ తొలి ఎడిషన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండుకు ఈ జట్టు పెద్ద షాక్ ఇచ్చింది. తర్వాత వరుస పెట్టి పాకిస్తాన్, శ్రీలంకను మట్టి కరిపించింది.
పూణే వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను ఏడు వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను నమోదు చేయాలని చూస్తున్నది.ప్రస్తుతం ఈ టీము వెనకాల ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్ జోనాధన్ ట్రాట్ కాగా ఆ రెండో వ్యక్తి జట్టు మెంటరుగా ఉన్న అజయ్ జడేజా.
గతంలో టీమిండియా కెప్టెన్ గా అజయ్ జడేజా వ్యవహరించారు. ఆ అనుభవం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి జట్టులో మెంటర్ పాత్ర నామ మాత్రమే అయినా కూడా జడేజా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ కు అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. వన్ టు వన్ కోచింగ్ తో పాటు జట్టు వ్యూహాల్లో కీలకంగా మారాడు. తన టైంలో బెస్ట్ ఫీల్డర్ గా చలామణి అయినా జడేజా ఆఫ్ఘనిస్తాన్ కు ఫీల్డింగ్ మెలకువలు కూడా నేర్పిస్తున్నాడు. అలాగే భారత్ లో స్థితిగతులపై అవగాహన లేని చాలామంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు తోడుందిస్తున్నాడు.
జడేజా మెంటర్షిప్ లో ఆఫ్ఘనిస్తాన్ మునుముందు మరిన్ని సంచలన విజయాలు నమోదు చేసే అవకాశం ఉంది.కాగా 52 ఏళ్ళు జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్ మ్యాచ్ లు, 196 వన్డేలు ఆడాడు. జడేజా టీమిండియా కు 13 వన్డేల్లో నాయకత్వం వహించాడు. 15 టెస్టుల్లో నాలుగు అర్థ సెంచరీలు సాయంతో 576 పరుగులు చేసిన జడేజా 196 వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 అర్థ సెంచరీలు సాయంతో 5359 పరుగులు చేశాడు.
Also Read:నిన్నటి మ్యాచ్లో టీమ్ ఇండియా ప్లేయర్స్ “బ్లాక్ బ్యాండ్” ఎందుకు ధరించారు..? కారణం ఏంటంటే..?