నిన్న లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియన్ టీం ఇంగ్లాండ్ టీం ను చిత్తుగా ఓడించింది. 100 పరుగుల తేడాతో ఇండియన్ టీం విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం మెయిన్ ఆర్డర్ బ్యాటర్లందరూ వరుస పెట్టి అవుట్ అయిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందుండి నడిపించాడు. అతనికి సూర్య కుమార్ యాదవ్ కూడా మంచి సహకారం అందించాడు.

Video Advertisement

అయితే తర్వాత బ్యాటింగ్ కి జరిగిన ఇంగ్లాండ్ టీం ని ఇండియన్ బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. అసలు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కి ఎక్కడ కూడా రన్స్ తీయడానికి అవకాశం ఇవ్వలేదు. బౌలర్లు షమీ, బమ్రా అయితే వీర విహారం చేశారు. మొత్తం మీద టీం విజయం సాధించింది. ప్రపంచ కప్ లో ఓటమి ఎరగని జట్టుగా నిలిచింది.

 అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో క్రికెట్ అభిమానులను మరొక విషయం బాగా ఆకట్టుకుంది. అదంటంటే ఇండియన్ ఆటగాళ్ల చేతికి బ్లాక్ ఆర్మ్ బాండ్స్. అవి ఎందుకు ధరించారా అంటూ అందరూ ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే అక్టోబర్ 23న కన్నుమూసిన టీమిండియా దిగ్గజ ఆటగాడు బిషన్ సింగ్ బేడికి నివాళిగా వీటిని ధరించినట్లు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

ఈ ఆటగాడు తన కెరీర్ లో 266 వికెట్లు తీసుకున్నాడు.14 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఓ మ్యాచ్ లో పదికి పది వికెట్లు తీశాడు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల్లో పర్యటించిన భారత జట్టుకు మేనేజర్ గాను వ్యవహరించాడు. మణిందర్ సింగ్, సునీల్ జోషి, మురళి కార్తిక్ లాంటి స్పిన్నర్లను తీర్చిదిద్దింది ఆయనే.

Also Read:నీకు ఇన్ని ఛాన్సులు అనవసరంగా ఇస్తున్నారు రా బాబు..!” అంటూ… ఈ ప్లేయర్ పై ఫైర్ అవుతున్న ఇండియన్స్..! ఎవరంటే..?