లాక్ డౌన్ ముగిసింది. మరోవైపు కోవిడ్ తీవ్రత కూడా కాస్త తగ్గడంతో హీరోలు తిరిగి షూటింగ్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే పలు షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవగా, సీనియర్ హీరోల చిత్రాలు కూడా తిరిగి షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. బాలయ్య శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న ‘అఖండ’ చిత్రం కూడా షూటింగ్ తిరిగి ప్రారంభించారు.
సోమవారం నాడు హైదరాబాద్ లో తిరిగి షూటింగ్ పునప్రారంభించారు. ఇప్పటికే టీసర్ కి విశేష స్పందన లభించగా సుమారు 50 మిలియన్స్ వ్యూస్ సాధించాయి. మరోవైపు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.ఈ చివరి షెడ్యూల్ లో షూటింగ్ భాగం మొత్తం పూర్తి చేసే సన్నాహాలు చేస్తూన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా కి థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.సినిమాలో ని బాలయ్య గెటప్ ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.హీరో శ్రీకాంత్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.