క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్క, వదిన పాత్రలలో ఆమె ఎంతగానో తెలుగువారికి దగ్గరయ్యారు. ఇప్పటివరకు ఆమె తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు మూడు వందల చిత్రాల వరకు నటించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో 1987 లో వచ్చిన “అగ్నిపుత్రుడు” సినిమా తో రజిత తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు రజిత లేడీ కమెడియన్ గా కూడా రాణించారు. ఇప్పటి వరకు రజిత వివాహం చేసుకోలేదు. ఇటీవలే.. రజిత “అలీతో సరదాగా” షో కు గెస్ట్ గా హాజరు అయ్యారు. ఈ సందర్భం గా ఆమె తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ షో లో ముచ్చట్లు చెప్పిన ఆమె, తనకు ఉన్న ట్రైన్ ఫోబియా గురించి వివరించారు.
ఆమె ట్రైన్ ఎక్కినపుడు ఆమెకు ఇబ్బందికర సంఘటనలు ఎదురయ్యేవట.. ఓ సారి ఇలానే చెన్నై నుంచి.. హైదరాబాద్ కు రావడానికి నిర్మాతలు ఏసీ బోగి బుక్ చేశారట. అయితే.. ఆ సమయం లో ఆమె వాష్ రూమ్ కి వెళ్ళడానికి రాగా… డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగ ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడట. ఆ వ్యక్తి ఆమెను హగ్ చేసుకుని.. ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారట.
అయితే.. ఆమె గట్టిగా అరవాలనుకున్నారట..కాని ఆ ట్రైన్ సౌండ్ లో ఆమె అరిచినా ఎవరికీ వినబడదు.. ఆ తరువాత ఆ వ్యక్తి అక్కడనుంచి వెళ్ళిపోయాడట. మరొకసారి.. ఓ టీటీఈ తనతో కబుర్లు చెప్తేనే ఆమె టికెట్ ను కన్ఫర్మ్ చేస్తానని చెప్పారట. దీనితో.. ఆమెకు ట్రైన్ లో వెళ్లాలంటే భయం పట్టుకుందట. అప్పటినుంచి తనకు ఏదైనా ట్రైన్ లో టికెట్ బుక్ చేస్తే.. తన అసిస్టెంట్స్ కి కూడా అదే ట్రైన్ లో అదే బోగి లో టికెట్ బుక్ చేయాలనీ ఆమె కండిషన్ పెట్టేవారట. అలాగే ఆమెకు అభిమానులు ఎక్కువేనండోయ్. ఓ సారి అమెరికాలోని వర్జీనియా లో ఓ అభిమాని రజిత గారి కాలుని తన తలపై పెట్టుకున్నారట. ఇంకా పలు ఆసక్తికర విషయాలను రజిత అలీతో పంచుకున్నారు. ali tho saradaga latest episode 2021
Watch Video: