- చిత్రం : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
- నటీనటులు : అల్లరి నరేష్ ,ఆనంది, వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, రఘుబాబు, ప్రవీణ్,
- నిర్మాత : రాజేష్ దండా
- దర్శకత్వం : ఏఆర్ మోహన్
- సంగీతం : శ్రీచరణ్ పాకాల
- విడుదల తేదీ : నవంబర్ 25, 2022
స్టోరీ :
Itlu Maredumilli Prajaneekam Review: అల్లరి నరేష్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు. మారేడుమిల్లి రాజకీయ నాయకుడు రాబోయే ఎలెక్షన్స్ కోసం అక్కడ నివసించే అటవీ వాసులని ఓటర్లుగా పరిగణించాలని నిర్ణయించుకుని, అల్లరి నరేష్‌ను ఎన్నికల డ్యూటీ కోసం గిరిజన ప్రాంతానికి పంపుతారు. ఈ క్రమంలో అప్పన్న అనే అతను ఓటు వేయడానికి ఇష్టపడడు. ఆ తరువాత అతను రాజకీయ వ్యక్తుల చేతుల్లో హత్య చేయబడతాడు. అల్లరి నరేష్ అప్పనకు న్యాయం జరిగేలా పోరాడదానికి సిద్దపడతాడు. మారేడుమిల్లిలో గిరిజన సమస్యలను ఎలా తీర్చాడు. అప్పన్నకు జరిగిన నష్టానికి న్యాయం చేయగలిగాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.
Itlu Maredumilli Prajaneekam Review in Telugu రివ్యూ :
హీరో అల్లరి నరేష్ ఈమధ్య కాలంలో వరుస ప్రయోగాలు చేస్తున్నాడు. గత ఏడాది నాందితో మెప్పించాడు. ఇప్పుడు కూడా మళ్లీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే కంటెంట్ బేస్ మూవీతో వచ్చాడు. అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. అల్లరి నరేష్ సినిమాని తన భుజం పై మోస్తూ శ్రీనివాస్ పాత్రను ఒంటిచేత్తో మోసాడు.హీరోయిన్ ఆనందికి నటనకి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది.అయితే ఆనందికి పెద్దగా స్క్రీన్ స్పేస్ రాలేదు కానీ తక్కువ పాత్రలో తనని తాను నిరూపించుకుంది. వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారు. సంపత్ రాజ్, రఘుబాబు, ప్రవీణ్, ఇతర నటీనటులు సినిమాలో తమ పాత్రమేర న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
- కథ
- స్క్రీన్ ప్లే
- అల్లరి నరేష్ నటన
మైనస్ పాయింట్స్:
- స్లో నేరేషన్
రేటింగ్ :
2.5
ట్యాగ్ లైన్ :
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమా చూద్దాం అని అనుకునే వారికి మాత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఒక యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :