ఒకప్పుడులో పెద్దవారు అమ్మాయి వయసు చిన్నది గా అబ్బాయి వయసు కాస్త పెద్దదిగా చూసి వివాహం చేసేవారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు కానీ, నీకు మాత్రం వయస్సు అనేది కచ్చితంగా అవసరం. అయితే భారత క్రికెట్ లో మాత్రం ఈ రూల్ బ్రేక్ చేశారనే చెప్పవచ్చు.
అప్పటిలో తనకంత ఆరేళ్ల పెద్దదైనా అంజలిని సచిన్ టెండూల్కర్ పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించారు. ఇదే కోవలో తనకన్నా పెద్ద వయస్సు ఉన్న అమ్మాయిలు చేసుకున్న భారత క్రికెటర్లు ఉన్నారు. కానీ మిగిలిన వారికి సచిన్ కి వచ్చినంత పాపులారిటీ రాలేదని చెప్పవచ్చు.
#1.విరాట్ కోహ్లీ:
సోషల్ మీడియా లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈయన తన కన్నా ఏడాది పెద్దదైన అనుష్క శర్మ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
#2.సురేష్ రైనా :
ఐపీఎల్లో అదిరిపోయే రెస్పాన్స్ తో ‘మిస్టర్ ఐపీఎల్’ గా దీంతో తెచ్చుకున్నాడు సురేష్ రైనా. అయినా తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ ఒకే ఏడాదిలో పుట్టిన, రైనా కంటే 4 నెలలు పెద్దది ప్రియాంక.
#3.ఇర్ఫాన్ పఠాన్:
ఇండియా టీమ్ తరుపున టెస్టుల్లో మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ తీసిన బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ కూడా తనకంటే వయసులో పెద్దదైన దుబాయ్‌కి చెందిన సబా బైగ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
#4.హార్ధిక్ పాండ్యా:
భారత క్రికెట్ టీమ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, సెర్బియన్ నటి, బాలీవుడ్ మోడల్ నటాశా స్టాంకోవిక్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందే తండ్రి కూడా అయ్యాడు హార్ధిక్ పాండ్యా. నటాశా దాదాపు హార్ధిక్ కంటే రెండేళ్లు పెద్దది.
#5.రాబిన్ ఊతప్ప:
2007 టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో భాగస్వామి ఉన్న ప్లేయర్ రాబిన్ ఊతప్ప. ఊతప్ప తనకంటే నాలుగు సంవత్సరాలు పెద్దది అయిన భారత టెన్నిస్ ప్లేయర్ శీతల్ గౌతమ్‌ను ప్రేమించి పెళ్లాడాడు.
#6.జస్ప్రిత్ బుమ్రా:
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ని ప్రేమించి పెళ్లాడాడు. సంజన గణేశన్ కంటే జస్ప్రిత్ బుమ్రా 2 సంవత్సరాలు చిన్నవాడు.
#7.స్టువర్ట్ బిన్నీ:
భారత మాజీ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, స్పోటర్ట్స్ యాంకర్ మయంతి లంగర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే ఏడాదిలో జన్మించినా , బిన్నీ కంటే మయంతి నాలుగు నెలలు వయస్సులో పెద్దది
#8. వెంకటేశ్ ప్రసాద్:
టీమిండియా మాజీ మీడియం పేసర్ వెంకటేశ్ ప్రసాద్, జయంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జయంతి, వెంకటేశ్ ప్రసాద్ కంటే 9 ఏళ్లు పెద్దది. కాని వీరు విడాకులు తీసుకొని విడిపోయారు.
#9.అనిల్ కుంబ్లే:
టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సాధించిన క్రికెటర్ అనిల్ కుంబ్లే. 1999లో తన భర్తతో విడాకులు తీసుకున్న చేతనను ప్రేమించి పెళ్లాడాడు అనిల్ కుంబ్లే. తన కూతుర్ని భర్త దగ్గర్నుంచి తన దగ్గరకు తెచ్చుకోవడానికి చేతనకు సాయం చేసాడు కుంబ్లే. చేతన కుంబ్లే కంటే రెండేళ్లు వయస్సులో పెద్దది.