క్యారెట్ దుంప జాతికి చెందినప్పటికీ ..మంచి దుంపలు అని అందరికి తెలుసు 100 గ్రా క్యారోట్ లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది ముక్యంగా క్యారెట్ లో బీటా కెరోటిన్ అనేది బాగా ఉంటుంది ఇది లివర్ లోపటికి వెళ్లిన తరువాత విటమిన్ A గా ఇది మారుతుంది.ఈ క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ అనేది యాంటాక్సిడెంట్స్ లాగ ఉపయోగ పడుతుంది.యాంటాక్సిడెంట్స్ అంటే మన కణాలను జబ్బుల భారిన పడకుండా రక్షించటానికి బీటాకెరోటిన్ అనేది ఉపయోగ పడుతుంది. హాని కలిగించే తిళ్ళు మనం తీసుకున్నప్పుడు (ఉదాహరణకి : వేపుళ్ళు, నూనె పదార్థాలు )
ఫ్రీ రాడికల్స్ అని హాని కలిగించే పదార్థాలు వస్తాయి వాటన్నిటిని తీసివేయాలి అంటే బీటా కెరోటిన్.బాగా ఉపయోగ పడుతుంది.ముక్యంగా మనకు కంటి చూపును మెరుగు పరచటానికి క్యారెట్లు మంచివి అని తెలుసు.క్యారెట్లు లని కొందరు జ్యూస్ ల రూపంలో తీసుకుంటూ ఉంటారు మరి కొందరు పచ్చివి తీసుకుంటూ ఉంటారు…వీటి రెండిటిలో ఏది మంచిది అంటే ?
మాములుగా ఏదైనా కూడా రసము త్రాగటం కంటే కూడా తినడమే మంచిది ..ఉపయోగాలు తినడం లోనే ఉపయోగాలు బోలెడు ఉన్నాయట.,ఎందుకు అంటే నమిలి తింటున్నప్పుడు మూడు నాలుగు క్యారెట్లు కనీసం ఒక అరగంట పడుతుంది..నాలుగు క్యారెట్లు తినడానికి పట్టిన అరగంట లో అరా గ్లాసుడు ముప్పావు గ్లాసుడు లాల జాలం ఉత్పత్తి అవుతుంది.ఈ లాలా జాలం ఉత్పత్తి అవడం వలన జీర్ణప్రక్రియకు చాల ఉపయోగ పడుతుంది.క్రిములని చంపడానికి చక్కగా రుచి తెలియడానికి ఇవన్నీ చక్కగా పని చేస్తాయి నమిలి తినడం వలన ..కానీ క్యారెట్ రసం తీసుకోవటం వలన ఇవన్నీ ఏమి ఉండవు .ఇక క్యారెట్ జ్యూస్ ఎలాంటి సమయాల్లో ఉపయోగ పడుతుంది అంటే.క్యారెట్ ముక్కలను నమలటానికి తినడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయాన్నే ఆఫీస్ లకు వెళ్లే వారు,వ్యాపారాలకు వెళ్లే వారు కాలేజ్ లకు వెళ్లే వారు సమయం దొరకని సందర్భాల్లో ఇలా చేయడం ఉత్తమం.