బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో విన్నర్ అయినా బిందుమాధవి గురించి గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఆమె ఎంతో కష్టపడి ఆడి అభిమానులను మెప్పించి బిగ్బాస్ నాన్ స్టాప్ లో విజేతగా నిలిచి 40 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా గెలుచుకుంది. దీంతో తెలుగు బిగ్బాస్ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి మహిళగా పేరు సంపాదించుకుంది. దీంతో బిందుమాధవి పెళ్లిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.
ఈ తరుణంలో ఆమె తండ్రి స్పందించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. బిందు ఇంజనీరింగ్ చేసేటప్పుడే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశామని ఆయన అన్నారు. అప్పట్లోనే మంచి మంచి సంబంధాలు వచ్చాయని, ఐ ఆర్ ఎస్, డాక్టర్, అమెరికా ఇంజనీరింగ్, ఐపీఎస్ లాంటి సంబంధాలు వచ్చాయని దీంతో ఒక తండ్రిగా నేను ఆమెపై ఒత్తిడి తెచ్చానని అన్నారు. కానీ వివాహంకు ఆమె విముఖత చెప్పిందని దీంతో నేను చాలా బాధపడ్డానని ఆయన అన్నారు.
ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సంబంధాలు చూసాను అని కానీ బిందు ఒప్పుకోలేదని తెలియజేశారు. నేను చిన్న పిల్లని కాదని నా మంచి చెడ్డలను నేను చూసుకోగలనని సమాధానం ఇచ్చిందని అన్నారు. అప్పటినుంచి బిందు వివాహం విషయం ఆమెకి వదిలేశారని, ప్రస్తుతం కాలం మారిందని పిల్లల ఆకాంక్షలు, అభిరుచులను వారికే వదిలేయాలని తల్లిదండ్రులు వారు ఏం చేస్తున్నారో చూస్తూ నడుచుకోవాలని చెప్పారు.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారితో కలిపి మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా అఖిల్,అరియనా, అనిల్, బిందు, మిత్ర, శివ, బాబా ఫినాలే కి చేరుకున్నారు. శనివారం రోజున గ్రాండ్ ఫినాలే జరగగా హీరో నాగార్జున బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించాడు. ఇందులో అఖిల్ సర్థక్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో యాంకర్ శివ మాత్రం రెండవ రన్నరప్ గా నిలిచాడు.
వీరి స్థానాలను ముందుగానే అంచనా వేసుకున్న అరియనా 10 లక్షల సూట్ కేస్ తో రేసు నుంచి పక్కకు తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన టువంటి బిందుమాధవి ఎంత అమౌంట్ గెలుచుకుందో మీకు తెలుసా.. అక్షరాల 40 లక్షల రూపాయలు.. అయితే బిందుకు మాత్రం అరకోటి దక్కాలి కానీ మధ్యలోనే అరియనా డ్రాప్ అవడంతో ప్రైజ్ మనీ 10 లక్షలు తగ్గించారు.
మొత్తానికి ఊహించని గెలుపుతో బిందు మాధవి చాలా ఎమోషనల్ అయ్యింది. ఎవరికైనా కొన్ని రోజులు, కొన్ని నెలలు కష్టపడితే మాత్రం సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం దక్కుతుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే వారికి నా గెలుపు అంకితం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తర్వాత నాకు ఈ ట్రోఫి దక్కింది అని బిందు భావోద్వేగానికి లోనయింది.