బిగ్ బాస్ OTT విన్నర్ బిందు మాధవి.. ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుందో తెలిస్తే షాకవుతారు..?

బిగ్ బాస్ OTT విన్నర్ బిందు మాధవి.. ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుందో తెలిస్తే షాకవుతారు..?

by Sunku Sravan

Ads

బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైనా ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఈ షో గంట ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసే వాళ్ళు. వీరి ఆసక్తిని క్యాష్ చేసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం ఓటీటీ ద్వారా 24 గంటలు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించాలని భావించి నాన్ స్టాప్ షో మొదలుపెట్టారు.

Video Advertisement

మరీ విచిత్రం ఏమిటంటే బిగ్ బాస్ షోలో లేనన్ని గొడవలు ఈ ఓటీటీలో మాత్రం చోటుచేసుకున్నాయని చెప్పవచ్చు. ప్రేమలు మరియు ఆప్యాయతల కన్నా ఈ గొడవ ద్వారానే కంటెస్టెంట్ లు ఎక్కువగా ఫేమస్ అయ్యారు అని చెప్పవచ్చు.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారితో కలిపి మొత్తం 18 మంది పాల్గొన్నారు. వీరిలో ముఖ్యంగా అఖిల్,అరియనా, అనిల్, బిందు, మిత్ర, శివ, బాబా ఫినాలే కి చేరుకున్నారు. శనివారం రోజున గ్రాండ్ ఫినాలే జరగగా హీరో నాగార్జున బిందు మాధవిని విన్నర్ గా ప్రకటించాడు. ఇందులో అఖిల్ సర్థక్ రన్నరప్ గా నిలిచారు. ఇందులో యాంకర్ శివ మాత్రం రెండవ రన్నరప్ గా నిలిచాడు.

వీరి స్థానాలను ముందుగానే అంచనా వేసుకున్న అరియనా 10 లక్షల సూట్ కేస్ తో రేసు నుంచి పక్కకు తప్పుకుంది. మరి విజేతగా నిలిచిన టువంటి బిందుమాధవి ఎంత అమౌంట్ గెలుచుకుందో మీకు తెలుసా.. అక్షరాల 40 లక్షల రూపాయలు.. అయితే బిందుకు మాత్రం అరకోటి దక్కాలి కానీ మధ్యలోనే అరియనా డ్రాప్ అవడంతో ప్రైజ్ మనీ 10 లక్షలు తగ్గించారు.

మొత్తానికి ఊహించని గెలుపుతో బిందు మాధవి చాలా ఎమోషనల్ అయ్యింది. ఎవరికైనా కొన్ని రోజులు, కొన్ని నెలలు కష్టపడితే మాత్రం సక్సెస్ వస్తుంది. కానీ చాలామందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే విజయం దక్కుతుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే వారికి నా గెలుపు అంకితం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తర్వాత నాకు ఈ ట్రోఫి దక్కింది అని బిందు భావోద్వేగానికి లోనయింది.

 


End of Article

You may also like