ఇక బిగ్ బాస్ లో నాగార్జున లేనట్టేనా.. ఆయన స్థానంలో ఆ హీరోయిన్ రానుందా.?

ఇక బిగ్ బాస్ లో నాగార్జున లేనట్టేనా.. ఆయన స్థానంలో ఆ హీరోయిన్ రానుందా.?

by Sunku Sravan

Ads

బిగ్ బాస్ రియాలిటీ షోను ఆదరించే అభిమానుల సంఖ్య ప్రస్తుతం చాలావరకు పెరిగిపోయిందని చెప్పవచ్చు. మొదటి రెండు సీజన్లలో ఈ షో ను అంతగా పట్టించుకోలేదు.

Video Advertisement

కానీ తర్వాత మూడవ సీజన్ వచ్చేసరికి షో రేటింగ్ మాత్రం అమాంతంగా పెరిగిపోయింది. ఈ సీజన్ నుండే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అయితే కింగ్ నాగార్జున ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు రియాలిటీ షో లైన మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ కు వ్యాఖ్యాతగా చేస్తున్నారు. నాగార్జున మూడో సీజన్ నుంచి మొదలు ఇటీవలే కంప్లీట్ అయిన బిగ్బాస్ నాన్ స్టాప్ షోకు కూడా వ్యాఖ్యాతగా ఉన్నారు.

మళ్లీ బిగ్ బాస్ 6 సీజన్ కూడా మొదలు కాబోతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మరొక ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. బిగ్ బాస్-6 సీజన్ లో నిర్వాహకులు నాగార్జునకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రారంభమయ్యే సీజన్ కు నాగార్జున కాకుండా ఆయన మాజీ కోడలు సమంతాను వ్యాఖ్యాతగా తీసుకోవాలని అనుకుంటున్నారట. సమంత ఇదివరకే నాగార్జున వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు ఒకరోజు ఆయనకు బదులుగా ఈమె యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంలోనే సీజన్ సిక్స్ లో సమంతను తీసుకుంటే బాగుంటుందని నిర్వాహకులు భావించారట.

అందుకే నాగార్జునను తప్పించి ఆ స్థానంలో సమంతాను తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.


End of Article

You may also like