పిఆర్ టీం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట. అసలు పిఆర్ టీం అంటే ఏంటి.. పిఆర్ టీమ్స్ బిగ్ బాస్ షో కీ పని చేశాయా.. అవి లేకుంటే హౌస్ లో ఉండటం చాలా కష్టమేనా..?
కామన్ గా అయితే సినిమా ప్రమోషన్స్ కు పిఆర్ టీమ్ లను పెట్టుకుంటారు. సినిమా విడుదలైంది మొదలు థియేటర్స్ లో బొమ్మ పడే వరకు ఆ మూవీపై ఎక్కడ కూడా నెగిటివ్ టాక్స్ రాకుండా ప్రమోట్ చేయడం వీరి బాధ్యత.
అందుకోసమే నిర్మాణ సంస్థల వారి నుంచి ప్యాకేజీలు మాట్లాడుకొని సినిమాకు హైప్ తీసుకు వస్తూ ఉంటారు. వారికి ఎన్ని డబ్బులు ఎక్కువగా ఇస్తే సినిమాకు అంత ప్రమోషన్ ఉంటుందన్నమాట. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ తో అదరగొడతారు. అయితే ఈ వ్యవస్థ సినిమా నుంచి బిగ్ బాస్ వరకు విస్తరించి పోయింది. ఎంతగా అంటే బిగ్ బాస్ షోలో ముందుకు రావాలి అంటే ఈ టీమ్ వుండాల్సింది అన్నట్టుగా తయారైంది.
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఈ టీంల ప్రభావం ఎక్కువగా లేదు. సెకండ్ సీజన్ లో మాత్రం కౌశల్ విన్నర్ కావడానికి పిఆర్ టీం కారణం అనే ఆరోపణలు వచ్చాయి. ఇలా సీజన్ సీజన్ కు పిఆర్ టీమ్స్ విస్తరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని మరి హౌస్ లోకి వెళ్తున్నారని, ఈ సీజన్ లో అరియనా, బిందు మాధవి, మిత్రశర్మ, అఖిల్, స్రవంతి, శివ, హమీద ఇలా చాలా మంది ఈ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని హౌస్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
ఈ టీమ్ వారు వాళ్ల యొక్క సోషల్ మీడియా ఖాతాలను డీల్ చేస్తూ.. ప్రమోషన్స్ కు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఓట్లు వేయించడంలో ముందుంటారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అయినా.. మిత్రశర్మ టాప్ 5కీ వచ్చిన అది ఈ టీమ్ వల్లే అని వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ సందర్భంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బిందు పేక్ ఓటింగ్ వేయించుకుందని, ఆమె కోసం పిఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయని వాళ్లు ఫేక్ ఓటింగ్ ద్వారా బిందుకు ఓట్లు పడేటట్లు చేశారని ఆరోపించారు. దీనిపై బిందు స్పందిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తప్ప ఎలాంటి టీమ్లను వాడుకో లేదని, అలాంటిది మాకు ఏమి అవసరం లేదని , ఏపీ,కర్ణాటక,తెలంగాణ, చెన్నై ప్రాంతాలనుంచి ఓట్లు పడడం వల్లనే విన్నర్ అయ్యానని తెలియజేసింది. నిజానికి పీఆర్ టీమ్స్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అని అన్నది.