సచిన్ టెండూల్కర్ అంటే ఇండియన్ క్రికెట్ గాడ్. ఈయన పేరు వినగానే అందరికీ అతడి బ్యాటింగ్ రికార్డులే గుర్తుకొస్తాయి కానీ బౌలింగ్ లోనూ మాస్టర్ ఎన్నో మ్యాజికల్ బాల్స్ తో భారత్ ను గెలిపించాడు.వరల్డ్ కప్ లో మొన్న నెథర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ తరఫున ఏకంగా 9 మంది ప్లేయర్లు బౌలింగ్ వేశారు. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, కీపర్ కేఎల్ రాహుల్ తప్ప మిగతావాళ్లందరూ బౌలింగ్ వేయడం గమనార్హం.
ఈ క్రమంలో రోహిత్, విరాట్ కోహ్లీలు ఒక్కో వికెట్ కూడా తీసుకున్నారు. టీమ్ లో ఐదుగురు మెయిన్ బౌలర్ లు ఉన్నందున అవసరమైతే నాకౌట్ మ్యాచ్ లో ఒకరిద్దరితో కొన్ని ఓవర్లు వేయించాలని రోహిత్ ఈ ప్రయోగం చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ పని కాస్త ముందే చేయాల్సిందని.. అప్పుడు పార్ట్ టైమర్లకు కూడా మంచి ప్రాక్టీస్ దొరికేదని అంటున్నారు.
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీలా మంచి పార్ట్ టైమ్ బౌలర్లని తయారు చేసుకోవడంపై టీమ్ మేనేజ్మెంట్ ముందే ప్లాన్ చేసుకోవాల్సిందని చెబుతున్నారు.గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే.. భారత్ తరఫున పార్ట్ టైమర్ గా వచ్చి అద్భుతంగా బౌలింగ్ వేసిన వారిలో సచిన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. టెస్టుల్లో 46 వికెట్లు తీసిన మాస్టర్, టీ20ల్లో ఒక మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు. వన్డేల్లో అతడికి సూపర్బ్ రికార్డు ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్ లో ఏకంగా 154 వికెట్లు తీశాడు సచిన్.
రెండు సార్లు 5 వికెట్లు తీసినా సచిన్ కి బౌలింగ్ యావరేజ్ 5.1గా ఉంది. దీన్ని బట్టే చూస్తే అతడి బౌలింగ్ ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను తన బౌలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేసేవాడు సచిన్.అయితే పార్ట్ టైం బౌలర్ గా సచిన్ కి ఉన్న ఘనత మరి ఏ ఇండియన్ క్రికెటర్ కు లేదు.సచిన్ రికార్డ్ ను సమం చేసే ఇండియన్ క్రికెటర్ భవిష్యత్తులో వస్తారేమో చూడాలి.
Also Read:సిరాజ్ ఈ పద్ధతి మార్చుకోకపోతే ఓడిపోతాం ఏమో..? విషయం ఏంటంటే..?