ఆయన స్క్రీన్ మీద కనపడ్డారంటే చాలు మనకు తెలియకుండానే నవ్వేస్తాం…ఆయన ఒక సినిమా లో ఉన్నారని తెలిస్తే చాలు ఎంటర్టైన్మెంట్ లో మనకు ఫుల్ మీల్స్ ఇంక ఆయన లేని సినిమా ని మనం ఊహించుకోలేము..దశాబ్దాల పాటుగా మనల్ని అలరిస్తూ వస్తున్న కామెడీ కింగ్ ఎవరో ఇప్పటికే అర్థం అయివుంటుంది కదా ? ఎస్ ఆయనే బ్రహ్మానందం గారు..దాదాపుగా అందరి హీరోల సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గారు ఇక వెండి తెరని వీడబోతురనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అందుకు గల కారణం లేకపోలేదు..ఇటీవలి కాలం లో ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడం కూడా ఒక కారణం. అంతేకాదు కొత్త వారికి కూడా తగు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారని సమాచారం. గతం లో కూడా పలు మార్లు ఇదే విషయమై చెబుతూ ఉండేవారు కూడా..
ఇక పోతే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ని బుల్లి తెర మీద ఆరంభిస్తున్నారట. అంతే కాదు ఇప్పటికే సీరియల్స్ కి సంబంధించి పలు కథలు కూడా విన్నారని..వాటిని తెరకెక్కించే ప్రయత్నం లో కూడా బుల్లి తెర దర్శకులు పనులు మొదలు పెట్టేశారట..టాలీవుడ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే వెండితెర మీద కనపడక పోయినా ఆయన హాస్యాన్ని బుల్లితెర మీద ఆస్వాదించే అవకాశం ఆయన మనకు ఇవ్వబోతున్నారు..ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అయినా కూడా మరో విధంగా చూస్తే అది గుడ్ న్యూస్ ఏ కదా మరి ! లాక్ డౌన్ కారణంగా సీరియల్ కన్ఫర్మేషన్ పెండింగ్ లో ఉందంట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంక తెలియ రావలసి ఉంది.