YSRCP : కుల మత రాజకీయాల పై చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం : వైసీపీ కౌంటర్! కుల మత రాజకీయాల గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డురంగా ఉందని మంత్రి పేర్ని నాని విమర్శించారు శనివారం జరిగిన మీడియా సమావేశాల్లో మాట్లాడిన ఆయన పలు సంచలన కామెంట్స్ చేసారు. టీడీపీ పాలనలో పదువులు అన్ని అగ్ర కులాల వారికే ఇచ్చారని విమర్శించారు అంతే కాదు.
ఇవి కూడా చదవండి: నాని కామెంట్స్ పై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.!
ఇవి కూడా చదవండి: ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం… అలసటలో డ్రైవింగ్ చేయడంతో..!
కేంద్రం ఇచ్చిన రెండు మంత్రుల పెదవులని కూడా కమ్మ, క్షత్రియ కులాల వారికే ఇచ్చారని, అటు రాజ్య సభలోను అగ్ర కులకే పదవులు ఇచ్చారని చెప్పకొచ్చారు. కానీ సీఎం జగన్ గారు అలా కాదని క్యాబినెట్ పదువుల నుంచి అన్ని రకాల పదువుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు. చంద్ర బాబు సంఘటనలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత అయిదేళ్ల నుంచి మైనింగ్ చేసిన దేవినేని ఉమా నేడు వైస్సార్సీపీ ఎమ్మెల్యే కి అంటగట్టాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలోనే మైనింగ్ కు అనుమతులు ఇచ్చారని, దాన్ని బ్రోకరేజ్ చేసింది ఉమా అని విమర్శలు గుప్పించారు.