ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం… అలసటలో డ్రైవింగ్ చేయడంతో..!

ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం… అలసటలో డ్రైవింగ్ చేయడంతో..!

by Mohana Priya

ఇటీవల హైదరాబాద్ లోని ఫ్లైఓవర్ పై  ఒక ప్రమాదం జరిగింది. ఇటీవల ప్రారంభమైన బాల నగర్ లోని బాబు జగజీవన్ రామ్ ఫ్లైఓవర్ పై బైక్ అదుపు తప్పి సేఫ్టీ వాల్ ని ఢీ కొట్టి, ఆ బైక్ పై ఉన్న యువకుడు కింద పడ్డాడు.  వివరాల్లోకి వెళితే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కుడిదెన గ్రామానికి చెందిన అశోక్ అనే ఒక యువకుడు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

Video Advertisement

Bike crashes into Balanagar flyover

మంగళవారం ఉదయం కేపీహెచ్బీ లోని తన సోదరుడు యనమల అనిల్ ఇంటికి వచ్చాడు అశోక్. డ్రైవింగ్ టెస్ట్ కోసం తన బంధువు బైక్ పై ఉదయం 11 గంటల సమయంలో తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయానికి బాలా నగర్ ఫ్లై ఓవర్ మీదుగా వెళుతున్నాడు. వేగంగా వెళ్తున్న అశోక్, అదుపు తప్పి బ్రిడ్జ్ కి ఎడమ వైపు ఉన్న సేఫ్టీ వాల్ ని బలంగా ఢీ కొట్టి కింద పడిపోయాడు.

Bike crashes into Balanagar flyover

అశోక్ హెల్మెట్ ధరించినా కూడా, క్లిప్ సరిగ్గా పెట్టుకోకపోవడంతో గోడను ఢీ కొట్టిన వెంటనే హెల్మెట్ పడిపోయింది. దాంతో అశోక్ తలకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు 108 కి ఫోన్ చేసి సమాచారం అందించగా అశోక్ ని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది అశోక్ మరణించాడు అని చెప్పారు.

 

 

హెల్మెట్ సరిగ్గా ధరించి ఉంటే అశోక్ కి ప్రమాదం తప్పేది ఏమో అని స్థానికులు భావిస్తున్నారు. అశోక్ తమ్ముడు అనిల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ట్విట్టర్లో పోస్ట్ చేసి “నిద్ర లేకపోవడం, అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే బండి నడపకండి. రాత్రంతా లారీ డ్రైవింగ్ చేసి తగిన విశ్రాంతి తీసుకోకుండా బైక్ నడుపుతూ కింద పడి చనిపోయిన బైక్ రైడర్” అని రాసి పోస్ట్ చేశారు.


You may also like