భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతుంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు.
కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన విధానం పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి.తొలిత బ్యాటింగ్ చేయగా రోహిత్, గిల్ ఓపెనర్లుగా దిగారు. అయితే గిల్ 9 పరుగులకే అవుట్ అవ్వగా తర్వాత క్రీస్ లోకి వచ్చిన కోహ్లీ సైతం డెకౌట్ అయ్యాడు.
కోహ్లీ అవుట్ అయ్యాక క్రీస్ లోకి వచ్చాడు అయ్యార్. 12 ఓవర్ లో ఇంగ్లాండ్ బౌలర్ క్రిష్ వోక్స్ వేసిన షాట్ ఆఫ్ లెంత్ బంతిని షార్ట్ కొట్టే ప్రయత్నం చేశాడు. అది కాస్త మిడాన్ లో ఉన్న ఫీల్డింగ్ చేస్తున్న మార్క్ వుడ్ చేతికి చిక్కడంతో శ్రేయసయ్య అవుట్ అయ్యాడు.అయితే శ్రేయస్ షాట్ ఆఫ్ లెంత్ బంతులకు అవుట్ కావడం పరిపాటిగా మారింది. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ,న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లలో శ్రేయస్ ఇదే పరిస్థితిలో ఔట్ అయ్యాడు. వరుస మ్యాచ్ లలో షార్ట్ పిచ్ బంతులకు శ్రేయస్ అవుట్ అవడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ట్విట్టర్ లో దీనికి సంబంధించిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రపంచంలో పర్మినెంట్ అయినవి సూర్యుడు తూర్పు ఉదయించడం శ్రేయస్ అయ్యర్ షార్ట్ బాల్ అవుట్ అవ్వడం అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు. షార్ట్ గర్ల్స్ చాలా క్యూట్ గా ఉంటారు కానీ శ్రేయస్ అయ్యర్ వారితో డేటింగ్ చేయడు అంటూ మరొక అభిమాని కామెంట్ చేశాడు. ఇలా రకరకాల మీమ్స్ తో శ్రేయస్ అయ్యర్ నీ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. మరొకరైతే ఏకంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన అల్లు శిరీష్ వి నువ్వు అంటూ శ్రేయస్ అయ్యర్ నీ ట్రోలింగ్ చేశారు. రాబోయే మ్యాచ్ లో అయినా శ్రేయస్ అయ్యర్ తన ఆట తీరు మార్చుకుంటాడేమో చూడాలి.
Also Read:ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి “రోహిత్” మాస్టర్ ప్లాన్…షమీ, అశ్విన్ ఎవరి స్థానాల్లో ఆడతారంటే.?