ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి “రోహిత్” మాస్టర్ ప్లాన్…షమీ, అశ్విన్ ఎవరి స్థానాల్లో ఆడతారంటే.?

ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి “రోహిత్” మాస్టర్ ప్లాన్…షమీ, అశ్విన్ ఎవరి స్థానాల్లో ఆడతారంటే.?

by Harika

Ads

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 మ్యాచ్లలో టీం ఇండియా జోరుగా పెర్ఫార్మ్ చేస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో వరుసగా విజయం సాధించి 10 పాయింట్స్ పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈనెల 29న లక్నోలో టీం ఇండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది. అయితే లక్నో పిచ్ పై స్పిన్ బౌలింగ్ కు మేజిక్ క్లిక్ అయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఫైనల్ జట్టు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్ ఈ మ్యాచ్ లో ఎవరిని ఉంచుతాడు ఎవరిని తప్పిస్తాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్న గా మారింది.

Video Advertisement

ఎకానా స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గాయం కారణంగా హార్దిక ఆడలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టులో రెండు కీలక మార్పులు చేశారు.. శార్దూల్ ప్లేస్ లో షమీ ..హార్దిక్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే టీం ఇండియా కాంబినేషన్ లెక్కల్లో కాస్త తేడా కనిపిస్తోంది. రోహిత్ శర్మ , గిల్ ఓపెనర్స్ గా రంగంలోకి దిగనున్నారు. నెక్స్ట్ మన కింగ్ కోహ్లి..ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ బాధ్యత వహిస్తారు. ఫినిషర్ రోల్ ప్లే చేసే ఛాన్స్ సూర్యకుమార్ యాదవ్ కి దక్కనుంది.

ఇంతకు ముందు జరిగిన మ్యాచ్లలో రవీంద్ర జడేజా కీలకమైన పాత్ర పోషించాడు. బ్యాటింగ్ అదరగొట్టడమే కాకుండా బౌలింగ్ లో కూడా తన సత్తా చాటాడు. మరోపక్క షమీ ఐదు వికెట్లు పడగొట్టి కివీస్ పై టీం ఇండియా గెలుపుకి కారణమయ్యాడు. అయితే ప్రస్తుతం నెక్స్ట్ మ్యాచ్ జరిగే స్టేడియం పిచ్ స్పిన్ కు సహకరించే నేపథ్యంలో ఆర్ అశ్విన్ ను జట్టులోకి తీసుకునే ఆస్కారం కనిపిస్తోంది.ఒకవేళ అదే జరిగితే..పాపం షమీ పడ్డ కష్టమంతా వృధా అవ్వడమే కాకుండా అతను బెంచ్ కి పరిమితం అవుతాడు. అయితే షమీ పర్ఫామెన్స్ ని దృష్టిలో పెట్టుకొని అతన్ని టీం లో కంటిన్యూ చేస్తూ మహమ్మద్ సిరాజ్ కి గ్యాప్ ఇచ్చి అతని ప్లేస్ లో అశ్విన్ జట్టులోకి తీసుకోవాలి అని రోహిత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ టీం అనౌన్స్ చేసే వరకు ఏ విషయం పై స్పష్టత లేదు.


End of Article

You may also like