తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు ప్రకటించక ముందే ఆసక్తిని రేపిస్తూ ఉంటాయి. ఎవరు ఊహించని విధంగా ఆ డైరెక్టర్ ఈ హీరో కలిసి సినిమా చేస్తున్నారు అంటూ గాసిప్స్ కూడా వస్తూ ఉంటాయి. పోగలేనిదే నిప్పు రాదు అన్నట్టు ఎంతోకొంత నిజం లేకుండా ఆ వార్తలు బయటకు రావు. అలాంటి ఎన్నో క్రేజీ కాంబినేషన్ లు తెలుగు సినిమాలో వచ్చాయి.
అలాంటి ఒక డిఫరెంట్ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అదే బాహుబలి ప్రభాస్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్. వినడానికే ఎంత సర్ప్రైజింగ్ గా ఉంది కదా.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ డైరెక్టర్ లు, హాలీవుడ్ డైరెక్టర్ లు కూడా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆయన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ వన్, పార్ట్ టూ లో నటిస్తున్నారు. అది కాకుండా మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా, నాగ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్టు ఖల్కి సినిమాలు కూడా చేస్తున్నారు. ఇది కాక లైనప్ లో ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి హానురాగవపూడి, మైత్రి మూవీస్, ప్రభాస్ కాంబినేషన్ సినిమా.ఇది కూడా త్వరలో పట్టాలెక్కనుంది.అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన దమ్ మసాలా సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. త్రివిక్రమ్ రైటింగ్ కి, డైరెక్షన్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.త్రివిక్రమ్ రైటర్ గా కూడా ఎన్నో ఫ్యామిలీ జోనర్ సినిమాలు కి పనిచేశారు. ఆయన డైరెక్షన్ లో కూడా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చాయి.అయితే ప్రభాస్ మాత్రం త్రివిక్రమ్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేయాలని అనుకుంటున్నారట.
ఇటువంటి సినిమాలు చేయడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. ఒకవేళ ఈ మూవీ పట్టాలెక్కితే త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యు.వి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ గనక సెట్ అయితే త్రివిక్రమ్ డైలాగులు ప్రభాస్ నుండి వినబడితే ఆ మజా వేరేగా ఉంటుంది. ఈ కాంబినేషన్ త్వరగా రావాలని త్రివిక్రమ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
Also Read:పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి రెమ్యూనరేషన్ ఎందుకు తిరిగిచ్చారు?