పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన చేసిన మంచి పనులకే చాలామంది ఆయనకు అభిమానులు అయిపోయారు.
Video Advertisement
అయితే పవర్ స్టార్ మరోసారి తన మంచి మనసు చాటు కున్నారు. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ తిరిగి వెనక్కి ఇచ్చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా మారారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.అయితే ఎన్నికల వేళ కావడంతో ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.ప్రస్తుతం పవన్ హరిష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. అటు సుజిత్‌తో కలిసి ఓజీ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.రీసెంట్ గా ఆయన సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్ కి డబ్బులు అవసరం ఉంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ని మళ్లీ వెనక్కి ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది.ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు.హరి హర వీర మల్లు సినిమా ప్రొడ్యూసర్ ఏంఏ రత్నం.
ఆయనకు కొన్ని అనివార్య కారణాల వల్ల డబ్బులు అవసరం పడితే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి లో ఉన్నప్పుడు ఆయనకి అవసరం ఉందని తెలుసుకున్న పవన్ రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారని తెలుస్తుంది.తర్వాత తీసుకుంటానని.ఇప్పుడు మీకు అసవరం కాబట్టి మీరు తీసుకోండని పవన్ వారికి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆపదలో ఉన్నవారికి పవన్ తప్పకుండా ఆదుకుంటాడని చెప్పడానికి ఇదో మరో ఉదాహరణ అంటున్నారు ఆయన అభిమానులు.
పవన్ నటిస్తోన్న మరో సినిమా “హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. పవన్ 52వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నంచి ఓ మోషన్ మోస్టర్‌ను వదిలారు.భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా OG.ఇక్కడ మరో విషయం ఏమంటే దర్శకుడు సుజీత్ స్వయంగా పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరో రేంజ్‌లో ఉన్నాయి.