తెలుగులో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సునీల్ ఒకడు. వందల చిత్రాల్లో కమీడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పటికీ కూడా సునీల్ పాత సినిమాల్లో కామెడీ అంటే పడి పడి నవ్వుతారు. తర్వాత హీరోగా మారాడు. అప్పుడు సునీల్ ఒక చిత్రానికి పది లక్షల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకునే వాడట. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో కొన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి.
తెలుగులో స్టార్ హీరోలు అందరి సినిమాల్లో సునీల్ కమెడియన్ గా నటించారు. త్రివిక్రమ్ సునీల్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసిన ప్రతి చిత్రంలోని సునీల్ కి మంచి పాత్ర ఇచ్చేవారు. ఆ సినిమాలో పాత్రలు సునీల్ కి మరింత లైఫ్ ఇచ్చాయి.
అందాల రాముడు సినిమా తర్వాత కూడా కమిడియన్ గా చేశారు. అయితే రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో మరింత క్రేజ్ అందుకున్నాడు. ఆ తర్వాత కమీడియన్ గా మానేసి వరుస పెట్టి సినిమాల చేయడం మొదలుపెట్టాడు. పూలరంగడు సినిమాకి మూడు కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.ఆ తర్వాత సునీల్ నటించిన సినిమాలన్నీ వరుస పెట్టి ఫ్లాప్ అవడం మొదలుపెట్టాయి. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. సునీల్ ని జనాలు మళ్ళీ కమీడియన్ గా యాక్సెప్ట్ చేయలేదు.
తర్వాత నెగిటివ్ పాత్రలు కూడా చేయడం మొదలుపెట్టాడు. కలర్ ఫోటో, పుష్ప సినిమాలు సునీల్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం విలన్ గా మంచి మంచి సినిమాలు చేస్తున్న సునీల్ రోజుకి 6 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడట. సునీల్ రెమ్యునిరేషన్ గురించి విన్న సినీవర్గాలు వారు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో బిజీగా ఉంటూనే తమిళ్ సినిమాలు ఇతర భాషల సినిమాలు కూడా చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా సునీల్ కి మంచి రోల్ దక్కింది.
Also Read:ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?