ఒక మనిషికి గుర్తింపు రావాలి అంటే కష్టపడాలి. అదే సోషల్ మీడియా ద్వారా ఒక మనిషికి గుర్తింపు రావాలి అంటే ఒక డిఫరెంట్ వీడియో చేసి పోస్ట్ చేస్తే చాలు. మెల్లగా సోషల్ మీడియా స్టార్ అయిపోతారు. అలా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

Video Advertisement

వారిలో కొంత మంది నిజంగానే టాలెంట్ ఉండి బయటికి వస్తే, మరి కొంత మంది మాత్రం వింత వింత వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగానే ఉంటుంది. ఇప్పుడు మీరు కింద ఫోటోలో చూస్తున్న వ్యక్తి అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

this man is famous

మీలో చాలా మంది ఇప్పటికే ఇతను ఎవరో గుర్తుపట్టేసి ఉంటారు. అతనే. రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్. “అన్నా నేను మల్లొచ్చినా” అని మాట్లాడుతూ యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్, అంతకుముందు టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత మెల్లగా తాను రైతు బిడ్డని అని, తనలాంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాంకి వెళ్తే ఒక రైతు పవర్ ఏంటో తెలుస్తుంది అని అర్థం వచ్చేలాగా వీడియోలు చేసి పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. దాంతో టిక్ టాక్ ద్వారా రాని పాపులారిటీ ఈ వీడియోల ద్వారా వచ్చింది.

this man is famousతర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రతి వీడియోలో బిగ్ బాస్ కి తనని పంపించండి అని అడిగాడు. అలా చివరికి అనుకున్నది సాధించి బిగ్ బాస్ లో అడుగు పెట్టాడు కూడా. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని పల్లవి ప్రశాంత్ పాత వీడియోలు ఇప్పుడు ప్రత్యక్షం అయ్యాయి. దాంతో పల్లవి ప్రశాంత్ టిక్ టాక్ వీడియోస్ కూడా చేసేవారు అని అందరికీ తెలిసింది. ఇది మాత్రమే కాదు. ఒక బిగ్ బాస్ సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్ ఆడియన్స్ లో కూడా కనిపించాడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు.

watch video :

ALSO READ : “అల్లు అర్జున్” లో ఈ మార్పు ఎందుకు వచ్చింది..? దీనికి కారణం ఏంటి..?