మన వాళ్ళు ఏది చేసినా విపరీతంగానే చేస్తారు. ఒక హీరోని ఇష్టపడితే అది కూడా విపరీతంగానే ఉంటుంది. ఆ హీరోని ఒక మనిషి లాగా చూడడం మానేసి ఒక దేవుడు లాగా చూసి మేము వారి భక్తులం, వారి కోసం ఏమైనా చేస్తాం అని అంటూ ఉంటారు.

Video Advertisement

అదే ఒక హీరోని ఇష్టం లేకపోతే అంతే విపరీతంగా ట్రోల్ కూడా చేస్తారు. ఒక్కసారి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చూస్తే మనం ఆ హీరో ఫ్యాన్ కాకపోయినా కూడా ఆయనని చేసే ట్రోలింగ్ చూస్తే మనకే విరక్తి వస్తుంది. అంత ఘోరంగా ఉంటుంది. హీరోలని అనరాని మాటలు అంటారు. చాలా మంది హీరోలు ఇవన్నీ పట్టించుకోకపోయినా కూడా ఒక సమయంలో ఇవన్నీ వారి దృష్టికి వెళ్తాయి.

list of best performances by allu arjun..!!

అసలు ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే మామూలు వ్యక్తులకే బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఆ హీరోల పరిస్థితి ఇంక ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కామెంట్స్ వారి కాన్ఫిడెన్స్ మీద కూడా దెబ్బ కొడతాయి. ఒక సమయం వరకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేసిన మహేష్ బాబు, అలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పరిమెంట్ సినిమాలో జోలికి వెళ్ళకుండా రొటీన్ సినిమాలు అయినా సరే ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.

what happened to allu arjun

సినిమా కాన్సెప్ట్ సంగతి పక్కన పెడితే తన వల్ల తన సినిమా మీద ఆధారపడిన వారికి నష్టం రాకూడదు అనే ఉద్దేశంతో మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అర్థం అవుతోంది. సినిమా మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ మహేష్ బాబు మీద ఎంత ప్రభావం చూపించాయో ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇలాగే అయ్యింది. అల్లు అర్జున్ మొదటి సినిమా నుండి ఇటీవల వచ్చిన పుష్ప సినిమా వరకు మెరుగుపరుచుకుంటూనే ఉన్నారు.

what happened to allu arjun

అల్లు అర్జున్ లుక్స్ పరంగా మొదట్లో సాధారణంగా ఉన్నా కూడా తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ స్టైలిష్ స్టార్ అయ్యారు. మిగిలిన హీరోలకు ఎలాంటి కామెంట్స్ వస్తాయో అల్లు అర్జున్ కి కూడా అలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి.  అందులోనూ ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాల్లో, ఇంటర్వ్యూల్లో మాట్లాడిన కొన్ని మాటలు మీద, అక్కడ అనుకోకుండా ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీద కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అలా అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఈవెంట్ లో నవ్వుతున్న ఒక వీడియో చాలా ఫేమస్ అయ్యింది. ఫేమస్ అంటే పాజిటివ్ గా కాదు. విపరీతంగా ట్రోల్ చేశారు.

what happened to allu arjun

అల్లు అర్జున్ చాలా ఓపెన్ గా నవ్వుతారు. చాలా కల్మషం లేని నవ్వు అది. దీని మీద అయిన ట్రోలింగ్ ఎంత ఎక్కువగా ఉంది అంటే, అలా ఎప్పుడూ హాయిగా నవ్వే అల్లు అర్జున్ ఇటీవల మంగళవారం ఆడియో లాంచ్ వేడుకలో మొహానికి చేయి అడ్డం పెట్టుకొని నవ్వారు. అలా నవ్వుతున్నప్పుడు అల్లు అర్జున్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ట్రోలింగ్ అనేది కామన్.

what happened to allu arjun

ఎంత తగ్గించినా కూడా మళ్లీ వస్తూనే ఉంటుంది. దాన్ని హీరోలు ఒక పాయింట్ వరకు పట్టించుకోరు. కానీ ఒక మనిషి కాన్ఫిడెన్స్ దెబ్బ తీసేలా ట్రోలింగ్ చేశారా? దాని వల్ల ఇంత ఇబ్బంది పడ్డారా? హీరో కూడా ఒక మనిషే కదా? వారికి మాత్రం ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ అనిపించదా? దాంతో ఇప్పుడు ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఇలాగే అల్లు అర్జున్ కి మద్దతు పలుకుతున్నారు.

ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అతను ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగ్గ పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?