ఈ ఫోటోలో ఉన్న అతను ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగ్గ పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న అతను ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగ్గ పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

by kavitha

Ads

ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి, నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోగా రాణిస్తున్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, చిన్న పాత్రలు, విలన్ గా ఆ తరువాత హీరోగా మారిన ఆయన కొట్లాదిమందికి అభిమాన హీరోగా నిలిచారు. దేశం గర్వించదగ్గ హీరో అయ్యాడు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి.

Video Advertisement

నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుండి అభిమానులు వరకు చిరంజీవికి సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు. ఫ్యాన్స్ చిరంజీవి ఫోటోలు షేర్ చేస్తున్నారు.  వాటిలో ఆయన చిన్ననాటి ఫోటో వైరల్ గా మారింది. ఇందులో ఉన్న మరొక ఫోటోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు. చిరంజీవి సోదరుడు నాగబాబు.
చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఎన్నో కష్టాలు పడి, మెగాస్టార్ గా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. చిరంజీవి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఆయన అసలు పేరు శివ శంకర వరప్రసాద్. 1955లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఆగష్టు 22న చిరంజీవి జన్మించారు. ఆయనకు చిన్నతనంలోనే నటన పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. చదువు పూర్తి చేసుకొని చిరంజీవి 1976లో చెన్నైలో ఉన్న మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరి, నటనలో శిక్షణ తీసుకున్నారు.
చిరంజీవి 1978లో ‘పునాది రాళ్లు’ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు. అయితే ఆ మూవీ కన్నా ముందు ‘ప్రాణం ఖరీదు’ అనే మూవీ విడుదల అయ్యింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలో నటించిన ‘మనవూరి పాండవులు’ అనే మూవీతో చిరంజీవికి గుర్తింపు వచ్చింది. మోసగాడు, ఇది కథ కాదు, రాణీ కాసుల రంగమ్మ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, విలన్‌గా కూడా నటించి నటుడిగా చిరంజీవి గుర్తింపు తెచ్చుకున్నాడు.
1980లో చిరంజీవి హీరోగా నటించిన ‘మొగుడు కావాలి’ మూవీ విజయం సాధించి, తొలి సిల్వర్‌ జూబ్లీ సినిమాగా రికార్డు సృష్టించింది. తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీని నిర్మించారు. ఆ తర్వాత ‘తిరుగులేని మనిషి’ మూవీలో చిరంజీవి ఎన్టీఆర్‌ తో కలిసి నటించారు. ఆ తర్వాత వచ్చిన ‘చట్టానికి కళ్లులేవు’ మూవీతో మాస్‌ హీరోగా మారారు. ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించారు.
రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ సినిమాలతో చిరంజీవి ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ, ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తూ, మరెన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, టాలీవుడ్ లో ఎదురులేని టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన “పవన్ కళ్యాణ్” కొడుకు అకీరా..! ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?


End of Article

You may also like