పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్  చిత్రాలకు బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్  ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నారు.

Video Advertisement

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కు కూడా యూత్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అకీరా సినీ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో అకీరా నందన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పవన్ కళ్యాణ్ తనయుడు, రేణు దేశాయ్ గారాల కుమారుడు అకిరా నందన్.  రేణు దేశాయ్ తన కుమారుడికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అకిరా సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పటికే చాలాసార్లు ప్రచారాలు జరిగాయి. అయితే వాటిని రేణూ దేశాయ్ ఖండించింది. అయినప్పటికీ అకిరా ఎంట్రీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
అకిరా ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణూ దేశాయ్ నార్వేలో అకిరా నందన్‌తో ఉంది. తాజాగా అకిరా నందన్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అకిరాతో పాటు దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కూడా ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.
ఇక రాఘవేంద్ర రావుతో అకిరా కనిపించడంతో ఏదో ఉందని అనుకున్నారు. నెటిజెన్లు రాఘవేంద్ర రావుతో లాంచ్ చేయిస్తున్నారా? అకిరా యాక్టింగ్‌ స్కూల్‌లో చేరారా? అని రేణూ దేశాయ్ పై ప్రశ్నలు అడుగుతున్నారు. రేణూ దేశాయ్ నెటిజన్ల కామెంట్లకు ఇన్ స్టా స్టోరీలో జవాబు చెప్పింది. అకిరా ఏ యాక్టింగ్‌ స్కూల్‌లో జాయిన్ అవ్వలేదు. అకిరాకు ఇప్పుడు నటన పై ఆసక్తి లేదు. అకిరాకు నటించే ఆసక్తి వచ్చినపుడు ఆ విషయాన్ని ముందుగా ఇన్ స్టాగ్రాంలో అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది.

Also Read: “ఆచార్య సినిమాలో చేసిన తప్పు వీళ్ళు కూడా చేస్తున్నారు ఏంటి..?” అంటూ… “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” పై కామెంట్స్..!