“ఆచార్య సినిమాలో చేసిన తప్పు వీళ్ళు కూడా చేస్తున్నారు ఏంటి..?” అంటూ… “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” పై కామెంట్స్..!

“ఆచార్య సినిమాలో చేసిన తప్పు వీళ్ళు కూడా చేస్తున్నారు ఏంటి..?” అంటూ… “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” పై కామెంట్స్..!

by Mohana Priya

Ads

చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అనుష్క ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. నిశ్శబ్దం సినిమా తర్వాత మళ్లీ అనుష్క సినిమా చేయలేదు. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. మహేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది.

comments on these scenes in miss shetty mr polishetty trailer

ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక కామెడీ సినిమా అని అర్థం అవుతోంది. ఇందులో హీరో స్టాండ్ అప్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ చెఫ్ పాత్రలో కనిపిస్తారు. సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన సోనియా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. హీరోయిన్ తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. హీరో తండ్రి పాత్రలో మురళీ శర్మ నటిస్తున్నారు అని ట్రైలర్ చూస్తూ ఉంటే అర్థం అయ్యింది.

comments on these scenes in miss shetty mr polishetty trailer

ట్రైలర్ అంతా బాగానే ఉన్నా కూడా ఒక విషయం మీద మాత్రం కామెంట్స్ వస్తున్నాయి. సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్కలో మార్పు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమాల్లో అనుష్క అంతకుముందులాగా బరువు తగ్గి కనిపించలేదు. ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు అనుష్కని ఇష్టపడ్డారు. అందుకే భాగమతి సినిమాని ఆదరించారు. “మా స్వీటీ ఎలా ఉన్నా బాగుంటుంది” అని అంటున్నారు.

comments on these scenes in miss shetty mr polishetty trailer

అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే అనుష్కని యంగ్ గా చూపించడానికి కొన్ని ఫిల్టర్స్ వాడారు అని అర్థం అవుతోంది. చాలా సినిమాల్లో ఈ పద్ధతి అనుసరిస్తారు. అయితే కొన్ని సినిమాల్లో ఇలాంటివి తెలిసిపోతూ ఉంటాయి. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలో కూడా చిరంజీవిని ఒక సీన్ లో యంగ్ గా చూపించడానికి చేసిన ప్రయత్నం విఫలించడంతో ఆ సీన్ చూసి చాలా మంది ట్రోల్ చేశారు.

comments on these scenes in miss shetty mr polishetty trailer

అంతే కాకుండా మానాడు సినిమాలో శింబు పాత్రని కూడా కొన్ని చోట్ల అలాగే ఫిల్టర్ వాడి యంగ్ గా సన్నగా చూపించే ప్రయత్నం చేశారు. అవి కూడా తెలిసిపోయాయి. సీనియర్ హీరోల చాలా సినిమాల్లో ఈ ఫిల్టర్స్ వాడుతూ ఉన్నారు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో ఈ ఫిల్టర్ ఉన్నా కూడా హీరో వయసు తెలిసిపోయి హీరోయిన్ పక్కన చాలా పెద్దగా కనిపించారు.

comments on these scenes in miss shetty mr polishetty trailer

ఇప్పుడు ఈ సినిమాలో కూడా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ లో ఈ విషయం అర్థం అయిపోతోంది. ఏదో ఒకటి రెండు సీన్లు అంటే ఏమో కానీ సినిమా మొత్తం ఇలాగే చూపిస్తే కష్టం అని అంటున్నారు. మరి కొంత మంది, “ఏమో అసలు ఇలా చూపించాల్సిన అవసరం ఏముంది? అనుష్క చూడడానికి ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటారు. చాలా బాగా నటిస్తారు. ఇవన్నీ అవసరమా?” అని అంటున్నారు. మరి సినిమాలో ఎలా చూపిస్తారో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు..! అంత ప్రత్యేకంగా ఏం ఉంది ఇందులో..?


End of Article

You may also like