మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ మరియు గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ ‘గన్స్ అండ్ గులాబ్స్’. ఈ వెబ్ సిరీస్ ను ఫ్యామిలిమెన్, ఫర్జీ లాంటి సిరీస్ లు తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

Video Advertisement

దుల్కర్ సల్మాన్ మొదటిసారిగా నటించిన వెబ్ సిరీస్ ఇది. గ్యాంగ్ స్టర్స్ కి సంబంధించిన కథలతో ఇప్పటికే చాలా సినిమాలు తెరకెక్కాయి. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంతో  తెరకెక్కిన ‘గన్స్ అండ్ గులాబ్స్’  ఆగస్ట్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
‘గన్స్ అండ్ గులాబ్స్’ 1990ల కాలంలో ‘గులాబ్ గంజ్’ అనే ఊరులో సాగే స్టోరీ. గులాబ్ గంజ్ లో గవర్నమెంట్, ఔషధ తయారీ అవసరాల కోసం ఆ ఊరి రైతులు నిషేధిత నల్లమందుకు సంబంధించిన పంటను పండిస్తుంటారు. వారి దగ్గర ఆ పంటను గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంటుంది. అదే సమయంలో ఆ ఊరిలో ఉండే ఒక గ్యాంగ్ కూడా అక్రమంగా అక్కడి రైతులతో పెద్ద మొత్తంలో నల్లమందు పంటను పండిస్తుంది. ఈ పంటను వెస్ట్ బెంగాల్ కు చెందిన పెద్ద గ్యాంగ్‌స్టర్ కు అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది. దీనికి షేర్‌పూర్ లోని వేరే గ్యాంగ్ అడ్డుపడుతుంటుంది.
నల్లమందును కొనుగోలు విషయంలో ఈ రెండు గ్యాంగ్ ల మధ్య వార్ సాగుతూ ఉంటుంది. ఈ గోడవల వల్ల ‘నార్కోటిక్ ఆఫీసర్’ గా ఆ ప్రాంతానికి అర్జున్ వర్మ ( దుల్కర్ సల్మాన్) ను నియమిస్తారు. అర్జున్ నల్లమందు మాఫియాను ఎలా అడ్డుకుంటాడు?  ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? బైక్ మెకానిక్ గా పనిచేసే టిప్పు ( రాజ్ కుమార్ రావు) పాత్ర ఏమిటి?  రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే పోరులో ఎవరిది పైచేయి అనేది మిలిన కథ.ఏడు ఎపిసోడ్లు గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో టిప్పుగా రాజ్ కుమార్ రావ్ సహజంగా నటించాడు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. అర్జున్ గా ఆ క్యారెక్టర్ కి జీవం పోశాడు. వైవిధ్యమైన పాత్రలో గుల్షన్ దేవయ్య నటించాడు. అయితే రాజ్ అండ్ డీకే గత సిరీస్ ల రేంజ్ లో లేదని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ వెబ్ సిరీస్ అలరిస్తుంది.

Also Read:  దుల్కర్ సల్మాన్ “కింగ్ ఆఫ్ కొత్త” తో పాటు… ఈ వారం రిలీజ్ అవుతున్న 7 సినిమాలు..!