దుల్కర్ సల్మాన్ “కింగ్ ఆఫ్ కొత్త” తో పాటు… ఈ వారం రిలీజ్ అవుతున్న 7 సినిమాలు..!

దుల్కర్ సల్మాన్ “కింగ్ ఆఫ్ కొత్త” తో పాటు… ఈ వారం రిలీజ్ అవుతున్న 7 సినిమాలు..!

by kavitha

Ads

ప్రతివారం లాగే ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు విడుదల అవుతుండగా, వీటిలో డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అలాగే రీ రిలీజ్ సినిమా కూడా బాక్సాఫీస్ సంద‌డి చేయ‌బోతుంది.

Video Advertisement

ఈ వారం కాస్త హైప్ ఉన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న మరియు మీడియం రేంజ్ హీరోలు థియేటర్లలోకి  వస్తున్నారు. మరి ఈ వారం థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1. కింగ్ ఆఫ్ కొత్త:

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’. ఈ మూవీలో గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్‌లతో మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు భాషల్లో ఆగస్ట్ 24న రిలీజ్ కానుంది.
2. గాండీవధారి అర్జున:

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా గాండీవ‌ధారి అర్జున. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి డైరెక్టర్ ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకుడు. ఈ మూవీలో వ‌రుణ్‌తేజ్ గూఢ‌చారిగా నటిస్తున్నారు. హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ మూవీ 25న రిలీజ్ కానుంది.
3. బెదురులంక 2012:

కార్తికేయ‌ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ బెదురులంక. 2012 యుగాంతం బ్యాక్ డ్రాప్ లో  రూపొందుతోన్న ఈ చిత్రానికి క్లాక్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం 25న విడుదల కానుంది.
4. పార్ట్‌నర్ :

తమిళ హీరో ఆది, హన్సిక మోత్వాని ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా పార్ట్‌నర్. ఈ చిత్రానికి మనోజ్ దామోధరన్ దర్శకత్వం వహించారు. కీలక పాత్రలో కోలీవుడ్ కమెడియన్ యోగీబాబు నటించారు. డబ్బింగ్ మూవీ 25న రిలీజ్ కాబోతుంది.
5. బాయ్స్ హాస్టల్:

కన్నడలో ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచిన సినిమాలలో ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’ ఒకటి. యూత్‌ పుల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రిలీజ్ అయిన చిన్న సినిమా, బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘బాయ్స్‌ హాస్టల్‌’ టైటిల్ తో తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ మూవీ 26న రిలీజ్ కాబోతుంది.
6. మన్మధుడు:

హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు 2002 లో రిలీజ్ అయ్యి, విజయం సాధించింది. సోనాలి బెంద్రే, అన్షు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా 29న రీరిలీజ్ కానుంది.

Also Read: రజనీకాంత్ యోగి కాళ్ళకి ఎందుకు మొక్కారు..? దానికి కారణం ఇదేనా..?


End of Article

You may also like