ఈ సంవత్సరం ప్రతి పండుగ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. అధికమాసం కారణంగా ప్రతి పండుగ రెండు రోజుల్లో వచ్చింది. దీనివల్ల హిందువులకు, భక్తులకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఒకరు ఒక రోజంటే మరొకరు ఇంకో రోజు అంటూ వాదనలు కూడా జరుగుతున్నాయి. మొన్న దసరా పండుగ విషయంలో కూడా ఇదే జరిగింది. అది అయిపోయింది.
కానీ ఇప్పుడు దీపావళి పండుగ వస్తుంది. నవంబర్ 12 తారీఖున దీపావళి అని ఒకరు కాదు నవంబర్ 13 వ తారీఖున దీపావళి అని మరొకరు చెబుతున్నారు. దీపావళి అంటే మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసే రోజు. అసలు మహాలక్ష్మి అమ్మకి ఏ రోజు పూజ చేయాలి అంటూ భక్తులు తలపిక్కుంటున్నారు.ఈ విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చేందుకు పురోహితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళికి ముఖ్యంగా కావాల్సింది అమావాస్య గడియ. దీపావళి అంటే హిందువుల పండుగల్లో ప్రత్యేకమైనది. ఆ పండుగ రోజు నాడు ప్రతి ఇంట దీపాలు వెలిగించి మహాలక్ష్మి ఇంటికి స్వాగతిస్తారు.సత్యభామ నరకాసురుడిని వధించిన రోజుగా దానికి గుర్తుగా దీపావళి పండుగ చేసుకుంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి. చెడు పైన మంచి చేసే విజయమే ప్రతి పండగకి పునాది.అయితే దీపావళి మరో విధంగా కూడా చెబుతూ ఉంటారు. లోకంలోనూ, ప్రజల జీవితాల్లో ఉన్న కష్టాల చీకట్లను తొలగించి కొత్త దీపాల వెలుగులతో కొత్త జీవితాన్ని తీసుకువస్తుంది అంటూ పండితులు చెబుతారు. అయితే ఇలాంటి పండగలు కన్ఫ్యూజన్ రావడం అనేది నిజంగా ఆశ్చర్యమే.
నవంబర్ 12 నవంబర్ 13న అమావాస్య వ్యాప్తి ఉన్నా కూడా నవంబర్ 12 సాయంత్రమే అమావాస్య ఎక్కువగా ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.13వ తారీఖున ఉదయం 11 గంటల వరకు మాత్రమే అమావాస్య ఉంటుంది. చతుర్దశి ఉండే నరక చతుర్దశి నాడే దీపావళి పండుగ. కావున ఎక్కువ శాతం మంది నవంబర్ 12న దీపావళి జరుపుకోవడానికి నిర్ణయించుకున్నారు.
Also Read:ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదా..? ఆయన భార్య ఎవరో తెలుసా?