భారతదేశంలో ఎన్నో గొప్ప ఆలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అయితే ప్రతి ప్రత్యేకత కూడా ధర్మాన్ని చాటి చెప్పెదని పండితులు చెబుతారు.ఈ విధంగానే కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ లో ఉన్న విష్ణు మాయ ఆలయం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.

Video Advertisement

సంవత్సరానికి ఒకసారి ఈ ఆలయంలో నారీ పూజను నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా ఒక మహిళను ఆలయానికి ఆహ్వానించి, పీఠం పై కూర్చోపెట్టి ఆ మహిళకు పూజలు చేస్తారు. ఈ ఏడాది నారీ పూజలో కూర్చునే అవకాశం ప్రముఖ హీరోయిన్, రాజకీయ నాయకురాలు ఖుష్బూకి దక్కింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ ఖుష్బూ. కోలీవుడ్ లో ఏకంగా ఆమెకు అభిమానులు గుడినే కట్టారు. నార్త్ లో పుట్టి, పెరిగిన ఖుష్బూ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా  కొన్నేళ్ళ పాటు అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, మరో వైపు రాజకీయాలలో రాణిస్తూ, తమిళనాడు పాలిటిక్స్ లో ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఇప్పటికే ఒక నటిగా, ప్రొడ్యూసర్ గా, రాజకీయ నాయకురాలుగా రాణిస్తున్న కుష్బూ రీసెంట్ గా అరుదైన గౌరవం పొందింది.
కేరళ త్రిస్సూర్ లో విష్ణు మాయ దేవాలయంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది చేసే నారీ పూజలో కూర్చునే అవకాశం  సీనియర్ నటి కుష్బూకి దక్కింది. కుష్బూని ఆలయకమిటీ ఆహ్వానించగా, కుష్బూ నారీ పూజకు హాజరైంది.  ఆలయంలో ఒక పీఠం పై కుష్బూని కూర్చోపెట్టి పూజారులందరు పూజలు చేశారు. ఆ తరువాత కుష్బూకు నైవేద్యాలు ఇచ్చి, దీవించారు. కుష్బూ పూజకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో “దేవుని ఆశీర్వాదలు అందుకున్నాను. త్రిస్సూర్‌లోని విష్ణుమాయ దేవాలయం నారీపూజ కోసం ఆహ్వానించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.నారీపూజ కోసం ఎంపికైన వారిని మాత్రమే ఆహ్వానిస్తారు. దైవమే స్వయంగా ఆ వ్యక్తిని ఎన్నుకుంటుందని వారు నమ్ముతారు. నాకు ఇంతటి గౌరవాన్ని కలిగించినందుకు, ఆశీర్వదించినందుకు ఆలయంలోని ప్రతి ఒక్కరికీ నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రతిరోజూ ప్రార్థించేవారికి,  తమను రక్షించే సూపర్ పవర్ ఉందని నమ్మే వారందరికి, ఈ పూజ మంచిని తెస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను”. అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Also Read: ఒక సీనియర్ హీరో సినిమా అంటే ఇలా ఉండాలి ఏమో..? ఈ సినిమా చూశారా..?