IPL 2023: 2023 ఐపీఎల్ కోసం మినీ వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. అయితే ఈ క్రమంలో ప్రాంచైజీలు కొందరు ఆటగాళ్లను వదులుకుని,కొందరిని వేలంలో కొంటాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్రావోను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే సీఎస్కే సాధించిన ఎన్నో విజయాల్లో బ్రావో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థులను బ్రావో తన స్లోబాల్స్తో ముప్పుతిప్పలు పెడతాడు. అలాంటి అతన్ని మినీ వేలానికి ముందే రిలీజ్ చేస్తున్నామని సీఎస్కే తెలిపింది. అయితే బ్రావోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్. అతని కెరీర్లో ఆడిన 161 ఐపీఎల్ మ్యాచుల్లో 183 వికెట్లు తీసుకున్నాడు. ఇపుడు బ్రావో వయసు 39 ఏళ్లు. అందుకేనేమో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే సీఎస్కే అతన్ని వదులుకుందని తెలుస్తోంది.ప్రస్తుతం అతనికి ఆ టీం ఇచ్చే శాలరీ రూ.4.4 కోట్లు.
ఐపీఎల్లో ట్యాలెంటె ఉన్న ఆటగాళ్లకు భారీ ధర పలుకుతుందనడంలో సందేహమే లేదు. వారి దురదృష్టం కొద్ది ధర కాస్త అటూ ఇటూ అయినా కూడా పోటీ మాత్రం చాలా ఉంటుంది. కానీ ఈ ఆల్రౌండర్ కోసం మూడు జట్లు కాచుకొని ఉన్నాయి.అయితే మరి ఆ జట్లు ఏమిటో చూద్దాం.
ముంబై ఇండియన్స్..
బ్రావో తన ఐపీఎల్ కెరీర్ ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే చేరుకునేలా ఉన్నాడు. తొలి మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బ్రావో ఆ తరువాత చెన్నైతో కలిశాడు. ఇప్పుడు ముంబైలో ఆల్రౌండర్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానంలో బ్రావోను తీసుకునే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్ రాయల్స్ జట్టును ఒకసారి చూస్తే అందులో సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడనే విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడా ఆ లోటును పూడ్చుకోవడానికి బ్రావో వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది.
కోల్కతా నైట్ రైడర్స్..
కోల్కతా నైట్ రైడర్స్ బ్రావోను కేకేఆర్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసినా కూడా ఆడే పదకొండు మందిలో చోటు దక్కడం మాత్రం కష్టమే అనిపిస్తోంది. అయితే వీటిలో ఏ జట్టు బ్రావోను కొనుగోలు చేస్తుందో చూడాలి మరి.