దేశముదురు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ హన్సిక….ఆ సినిమా తర్వాత తెలుగు మంచి క్రేజ్ తెచ్చుకుంది.వరుసపెట్టి సినిమాలు చేసింది. తర్వాత తమిళ్ లో బిజీ అయ్యి, తెలుగులో సినిమాలు తగ్గించింది.ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ లకు మంచి ఆదరణ ఉండడంతో హన్సిక ప్రధాన పాత్రలో ఓ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ రూపొందింది.అదే మై నేమ్ ఇస్ శృతి…ఈ మూవీ తాజాగా విడుదల అయింది.ఎలా ఉందో రివ్యూ చూద్దాం….!
చిత్రం: మై నేమ్ ఇస్ శ్రుతి
నటీనటులు: హన్సిక,మురళి శర్మ,గురుమూర్తి,రాజ రవీంద్ర
దర్శకుడు:శ్రీనివాస్ ఓంకార్
సంగీతం: మార్క్ కె రాబిన్
విడుదల: నవంబర్ 17
కథ:
కిరణ్మయి (ప్రేమ) ఫేమస్ కాస్మోటిక్ సర్జిన్. ఎమ్మెల్యే గురునాథం అమ్మాయిలను వల వేసి ఇల్లీగల్‌గా వారి ఆర్గాన్స్‌ను అమ్మేస్తుంటాడు. ఓ సారి విక్రమ్ గ్రూప్స్ అధినేత భార్యకు చర్మ సమస్యలు వస్తాయి. దాని వల్ల చర్మ మార్పిడి చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న అమ్మాయిల కోసం వెతుకుతారు. డ్రగ్ డీలర్ అను (పూజా రామచంద్రన్) కూడా ఈ గ్రూపులో ఓ వ్యక్తిగానే ఉంటుంది. శ్రుతి (హన్సిక) ఊరి నుంచి హైద్రాబాద్‌లోని తన అక్కా బావ బాబీ (ప్రవీణ్) ఇంటికి వస్తుంది.
అప్పటికే చరణ్ (సాయితేజ్) అనే వ్యక్తితో శృతి ప్రేమలో ఉంటుంది. ఆ తరువాత కొన్ని రోజులకు ప్రియ అనే అమ్మాయితో కలిసి హాస్టల్‌కు షిప్ట్ అవుతుంది. ఆ తరువాత శృతి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చరణ్ నిజ స్వరూపం తెలుసుకున్న తరువాత శృతి ఏం చేసింది? అనుని చంపింది ఎవరు? అసలు ఈ గ్యాంగ్‌ను శృతి ఎలా ఆట కట్టించింది? శృతి ఆడిన మైండ్ గేమ్ ఏంటి? అన్నది తెరపై చూడాలి….!
రివ్యూ:
మై నేమ్ ఈజ్ శృతి కాన్సెప్ట్ కొత్తదే అయిన తీసిన విధానం మాత్రం పాతది, రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కొత్తగా ఉంటుంది. ఆడియన్స్ ను కాస్త కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుంది. కానీ ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా గజిబిజిగా సాగుతుంది. ముందుకు వెనక్కి కథనం సాగుతు స్క్రీన్ ప్లే ఆలోచించేలా, ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది. ఏం జరిగింది? ఏం జరగబోతోంది? అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండాఫ్ మరింత ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది.
అసలు మెయిన్ కథ అంతా కూడా సెకండాఫ్‌లోనే ఉంటుంది. ముందు నుంచి చూసిన సినిమా అంతా ఒకెత్తు అయితే..తర్వాత హన్సికను చూపించిన తీరు, ఆమె నటించిన విధానం ఒకెత్తు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో చూపించినే తీరు మరో ఎత్తు. అక్కడ వచ్చే ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే ట్యాగ్‌కు శృతిని ఉదాహరణగా చూపించాడు దర్శకుడు.
విశ్లేషణ:
స్కిన్ మాఫియా మీద ఇప్పటి వరకు సినిమా రాలేదు. దర్శకుడు ఈ పాయింట్‌ను తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంది.సాంకేతికంగానూ ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది. మార్క్ కే రాబిన్ పాటల కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా గుర్తుంటుంది. లెంగ్త్ తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. పాటలు అంతగా గుర్తుండకపోయినా మాటలు బాగుంటాయి. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.
హన్సిక ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోసింది. శృతి పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్‌లో ఒక రకంగా కనిపిస్తే.. క్లైమాక్స్‌లో ఇంకో రకంగా కనిపిస్తు నటనతో ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పిస్తుంది. ఏసీపీ రంజిత్‌గా మురళీ శర్మ తన అనుభవాన్ని చూపించాడు. డీజీపీగా జయ ప్రకాష్, ఎమ్మెల్యేగా గురుమూర్తి తనకు అలవాటైన రీతిలో నటించారు. అప్పాజీ అంబరీష, సీవీఎల్, సాయి తేజ్, రాజా రవీంద్ర పాత్రలు మెప్పిస్తాయి.
ప్లస్ పాయింట్స్:
- కథ
- హన్సిక నటన
- స్క్రీన్ ప్లే
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- గందరోళంగా ఉండే ఫస్ట్ హాఫ్
- రొటీన్ టేకింగ్
- సాంగ్స్
ఫైనల్ గా : శృతి… బ్యూటీ విత్ బ్రెయిన్ ట్యాగ్ లైన్ కు న్యాయం చేసింది
రేటింగ్: 3/5
watch trailer :