SAPTA SAGARALU DHAATI (SIDE B) REVIEW : సైడ్ A లాగానే ఈ సినిమా కూడా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

SAPTA SAGARALU DHAATI (SIDE B) REVIEW : సైడ్ A లాగానే ఈ సినిమా కూడా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

నెల రోజుల క్రితం సైలెంట్ గా రిలీజ్ అయ్యి, సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా సప్త సాగరాలు దాటి. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా, తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయినా కూడా ఒక తెలుగు సినిమాకి సమానంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగం రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • చిత్రం : సప్త సాగరాలు దాటి (సైడ్ B)
 • నటీనటులు : రక్షిత్ శెట్టి, చైత్ర ఆచార్, రుక్మిణి వసంత్.
 • నిర్మాత : రక్షిత్ శెట్టి
 • దర్శకత్వం : హేమంత్ రావు
 • సంగీతం : చరణ్ రాజ్
 • విడుదల తేదీ : నవంబర్ 17, 2023

sapta sagaralu dhaati side b movie review

స్టోరీ :

మొదటి పార్ట్ ముగిసిన పది సంవత్సరాల తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. 2021 లో మనిషితో మనిషి మాట్లాడడానికి, అసలు మాస్క్ లేకుండా రోడ్ మీదకి రావడానికి కూడా ఆలోచించే సమయంలో ఈ కథ నడుస్తుంది. జైలు నుండి మను (రక్షిత్ శెట్టి) బయటికి వచ్చేస్తాడు. ప్రియ (రుక్మిణి వసంత్) పెళ్లి చేసుకుంటుంది. ఒక బాబు కూడా ఉంటాడు. ఒక బట్టల కాణంలో పని చేస్తూ ఉంటుంది. మనుకి సురభి (చైత్ర ఆచార్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మను ప్రియని ఎలా కలిశాడు? సురభి మనుని ప్రేమించిందా? 10 సంవత్సరాల తర్వాత మనుని చూసిన ప్రియ ఏం చేసింది? తనని ఇబ్బంది పెట్టిన వారిపై మను పగ ఎలా తీర్చుకున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

sapta sagaralu dhaati side b movie review

రివ్యూ :

ఇండస్ట్రీలో ఒక సంవత్సరంలో ఎన్నో ప్రేమ కథలు వస్తాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా గుర్తుండిపోతాయి. ఇటీవల వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాని అలా గుర్తుండిపోయే సినిమాల కిందకే లెక్క వేస్తారు. లవ్ స్టోరీ అంటే కేవలం ఇద్దరు ఆనందంగా ఉండడం మాత్రమే కాదు, దానికి సమస్య కూడా ఉంటుంది అని ఈ సినిమా ద్వారా చూపించారు.

sapta sagaralu dhaati side b movie review

ఇద్దరు భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ప్రేమించుకుంటే, తర్వాత వాళ్ళు ఎదుర్కొనే పరిణామాలు ఏంటి అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. అంత క్లియర్ గా చెప్పడం కారణంగా సినిమాని రెండు భాగాలుగా వేరు చేసి ఇప్పుడు రెండవ పార్ట్ ని విడుదల చేశారు. జైలు నుండి బయటకు వచ్చిన మను, సురభి అనే అమ్మాయిలో ప్రియని చూసుకోవాలి అనుకుంటాడు. కానీ సురభి ప్రియకి ఎక్కడా దగ్గరగా ఉండదు. అయినా కూడా మను సురభిని ఇష్టపడతాడు.

sapta sagaralu dhaati side b movie review

మరొక పక్క ప్రియ తాను కలలు కన్న జీవితానికి పూర్తి భిన్నంగా ఉన్న జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. దాంతో మను ప్రియని ఎలా మార్చాడు అనే విషయాన్ని ఇందులో చూపించారు. మొదటి పార్ట్ లాగానే ఈ సినిమా కూడా ఎమోషన్స్ తో నిండి ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మను, ప్రియ అనే ఒక ఇద్దరు వ్యక్తుల ప్రేమ కథని చూస్తున్నట్టే ఉంటుంది. మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమా కథ పరంగా వివిధ విషయాలతో డీల్ చేస్తుంది. మను బయటికి రావడం, సురభి అనే కొత్త వ్యక్తి రావడం, ప్రియ పరిస్థితి మారిపోవడం, తనని ఇబ్బంది పెట్టిన వారిపై మను పగ తీర్చుకోవడం ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు.

sapta sagaralu dhaati side b movie review

ఎండింగ్ కూడా ఏ డబ్బు కోసం అయితే మను ఇంత చేసాడో, అదే డబ్బుని మరొకరికి ఎలా ఉపయోగించాడు అనేది చూపించారు. కానీ సినిమా అంతా చాలా స్లోగా నడుస్తుంది. సాధారణంగా ఫాస్ట్ పేస్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఈ విషయంలో మాత్రం సహనాన్ని పరీక్షించే అవకాశం ఉంది. సినిమా కథ ప్లెయిన్ గా ఉన్నా కూడా, ఒక దర్శకుడు తన పాత్రల నుండి మంచి పర్ఫామెన్స్ రాబడితే సినిమా అక్కడే సగం హిట్ అయిపోతుంది. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమాలో ఉన్న నటీనటులు అందరూ చాలా బాగా నటించారు.

sapta sagaralu dhaati side b movie review

సినిమా చూస్తున్నంత సేపు ఒక పోయేటిక్ ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ లో సింపుల్ గా ఉన్న స్టోరీ ఉండడం కారణంగా ఏమో కానీ, రెండు భాగాలని పోల్చి చూస్తే మొదటి భాగం బాగుంది ఏమో అనిపిస్తుంది. అలా అని దీన్ని తక్కువ చేయడానికి ఏమీ లేదు. కాకపోతే ఇందులో మల్టిపుల్ విషయాల మీద శ్రద్ధ పెట్టడంతో ఎమోషన్స్ పరంగా మొదటి భాగం చాలా బాగుంది అనిపిస్తుంది. ఇందులో ఎమోషన్స్ చూపించిన సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

 • నటీనటుల పర్ఫార్మెన్స్
 • కొన్ని ఎమోషనల్ సీన్స్
 • పాటలు
 • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

 • సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
 • తెలిసిపోయే కథ

రేటింగ్ : 

3/5

ట్యాగ్ లైన్ :

సినిమా స్లోగా ఉన్నా పర్వాలేదు అని అనుకునే వారికి, మొదటి భాగాన్ని విపరీతంగా ఇష్టపడిన వారికి సప్త సాగరాలు దాటి (సైడ్ B) సినిమా ఒక మంచి ఎమోషనల్ ప్రేమ కథగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : సూపర్ స్టార్ “కృష్ణ” చేయాల్సిన సినిమాని “చిరంజీవి” చేశారా..? ఆ సినిమా ఏది అంటే..?


End of Article

You may also like