ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్ ఫీవర్ నడుస్తుంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లు క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. ఇండియన్ టీం అయితే భీకరమైన ఫామ్ లో ఉంది. ఒకపక్క బ్యాటర్లు మరోపక్క బౌలర్లు విజృంభించి ఆడుతున్నారు. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో విజయాన్ని నమోదు చేశారు. టేబుల్ టాప్ ప్లేస్ లో నిలబడ్డారు.
భారత స్టార్ బెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు కూడా పరుగుల వరద పారిస్తున్నారు. ఒకరు మించి ఒకరు పోటాపోటీగా పరుగులు సాధిస్తున్నారు. ప్రతి టీంలో కూడా ఒకరిద్దరు బ్యాటర్స్ సూపర్ ఫామ్ లో కనబడుతున్నారు. ప్రతి టీంలో కూడా ఒకరిద్దరు బ్యాటర్స్ సూపర్ ఫామ్ లో కనబడుతున్నారు. అయితే ఈ ఇద్దరిని మించిన డేంజరస్ బ్యాటర్ మరొకరు ఉన్నారు.
అయితే ఈ ఇద్దరిని మించిన డేంజరస్ బ్యాటర్ మరొకరు ఉన్నారు. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్పులో మూడు సెంచరీలు బాదిన ప్లేయర్ గా నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో కూడా సెంచరీ బాధలు. ఈ మ్యాచ్ లో ఏకంగా 174 పరుగులు సాధించి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. మొత్తంగా ఈ ప్రపంచ కప్ లో ఐదు మ్యాచ్ లలో కలిపి 407 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీ 354 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 311 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ కూడా ఐదు మ్యాచ్ లోనే ఈ పరుగులు సాధించారు. దీనిబట్టి చూస్తే ఈ ప్రపంచ కప్పులో డీకాకు సూపర్ ఫామ్ లో ఉన్నాడని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.రోహిత్ కోహ్లీలు డి కాక్ ని దాటుకుని ముందుకు వెళ్లాలంటే రాబోయే మ్యాచ్ లలో ఇంకా విజృంభించి ఆడాల్సి ఉంటుంది. భారత్ కి ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.
Also Read:రోజుకి 8 కిలోలు తింటారు…రెండేళ్ల నుండి ఫిట్నెస్ పరీక్ష లేదు”…సొంత టీం నే తిడుతున్న పాక్ ప్లేయర్స్.!