తమ పేరు నిలబెట్టి ప్రయోజకులు కావలసిన కొడుకులు దారి తప్పి తిరిగితే తల్లిదండ్రులు ఎలా తిడతారో.. మనలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకు పనికిరాడు.. అని ఒకళ్ళంటే మావాడు మీ వాడి కంటే పెద్ద వెధవ అని ఇంకొకళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఇలా తండ్రులు మొత్తం ఒక దగ్గర కూర్చుంటే తమ కొడుకుల గొప్ప మాట దేవుడెరుగు కానీ తప్పులు మాత్రం బాగా వెతికి తిట్టుకుంటారు. సేమ్ ఇదే పరిస్థితి ఆఫ్గనిస్తాన్తో ఓటమి తర్వాత.. పాకు క్రికెటర్స్ ఎదుర్కొంటున్నారు.

Video Advertisement

తోచిన వారు తోచినట్టు తిట్టిపోస్తున్నారు. రోజుకి 8 కిలోల తిండి తింటున్నారు అని మొఖం మీద అడుగుతున్నారు.
మామూలుగా ఆట అన్న తర్వాత ఎవరో ఒకరు గెలవాలి ఇంకొకళ్ళు ఓడాలి అది సహజం. అయితే క్రికెట్ టీమ్స్ లోనే పిల్లజట్టుగా పరిగణించి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడానికి ఆ దేశ ప్రజలు మాజీ క్రికెటర్లు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా టీవీ డిబేట్ల లో పాల్గొన్న మాజీ క్రికెటర్లు కూడా ప్రస్తుత వరల్డ్ కప్ చెట్టుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఒకప్పటి స్టార్ ప్లేయర్స్ ప్రస్తుత ప్లేయర్లపై సెటైర్లు వదులుతున్నారు.

ఇలా తిడుతున్న వారిలో సానియా మీర్జా హస్బెండ్ షోయాబ్ మాలిక్ తో పాటు బాసిత్ అలీ, బాజిద్ ఖాన్, వసీం,అక్రమ్, మహ్మద్ హఫీజ్, అజహర్ అలీ, షోయాబ్ అక్తర్ వంటి వారు కూడా ఉండడం గమనార్హం
తమ టీం ఫిట్నెస్ గురించి వసీం అక్రమ్: మాట్లాడుతూ ” మా ఆటగాళ్ల మొఖం చూస్తే రోజుకు 8 కిలోలు మాంసాన్ని తినేట్టుగా ఉన్నారు.. గత రెండు సంవత్సరాలుగా జట్టుకి ఎటువంటి ఫిట్నెస్ పరీక్షలు లేవు.. ఈ టోర్నమెంట్ మొత్తంలో తక్కువ ఫిట్నెస్తో ఆడుతున్నది మా వాళ్లే..”అనిత అన్న అసహనాన్ని వ్యక్తం చేశాడు.

మరోపక్క మహమ్మద్ హఫీజ్ పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఒక క్రికెట్ అభిమానిగా తనను ఎంతో బాధకు గురి చేసింది అని అన్నారు. కనీసం రాబోయే మ్యాచ్లలో అయినా ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారు అని కాస్త ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇకనైనా పాక్ జట్టు మంచి ప్రదర్శన ఇస్తుందేమో చూడాలి.