మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇండస్ట్రీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండే వ్యక్తి. చిరంజీవి అంటే దాన కర్ణుడు అని అంటారు. అయన ఎంతో మందికి ఎన్నో సాయాలు చేస్తూ ఉంటారు కానీ అవి ఏమీ బయటకి రావు. మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో మంచి గౌరవం, గుర్తింపు ఉన్నాయి. డిసిప్లేన్ గా ఉంటారు ఎవరినీ పన్ను ఎత్తి మాట అనరు అనే పేరు కూడా ఉంది.
కానీ చాలా విషయంలో కావాలనే కొందరు చిరంజీవిని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటారు. చిరంజీవి ప్రమేయం లేకుండా జరిగిన వాటికి కూడా చిరంజీవిని నిందిస్తూ ఉంటారు. కానీ ఆయన వాటికి ఎప్పుడు స్పందించరు, తిరిగి మాట అనరు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని నవ్వుతారు.
తాజాగా చిరంజీవి ఆయన ఇంట్లో దీపావళి ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ పార్టీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని హీరోలని అందరినీ ఆహ్వానించారు. అయితే ఈవెంట్ కో ఒక సింగర్ జవాన్ సినిమాలో పాట పాడుతుండగా రామ్ చరణ్ వెళ్లి చిరంజీవిని తీసుకువచ్చారు. చిరు ఆమె పాడేపాటకి ఎంతో ఎనర్జిటిక్ గా డాన్స్ వేశారు. 68 ఏళ్ల వయసులో చిరంజీవి గ్రేస్ చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. అయితే డాన్స్ చేసే సందర్భంలో చిరు అనుకోకుండా ఆ సింగర్ కి టచ్ అయ్యారు. దీన్ని చాలామంది చిరంజీవి, మెగా ఫ్యామిలీ వ్యతిరేకులు నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు. మొత్తం వీడియో చూస్తే అసలు అక్కడఏం జరిగిందో అర్థం అవుతుంది.
అవేమీ పట్టని ఒక బ్యాచ్ మాత్రం చిరంజీవి కావాలనే ఇలా చేస్తారు అంటూ ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు.చిరంజీవి క్యారెక్టర్ ఏంటో ఆయన బిహేవియర్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన అన్ని మంచి పనులు చేసిన, ఎన్ని మంచి సినిమాలు చేసినా కూడా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ పట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. రీమేక్ సినిమాలు చేస్తున్నారు అని, మెగా ఫ్యామిలీ క్రికెట్ టీమ్ అంత ఉందని, యంగ్ హీరోస్ ని పక్కన పెట్టుకొని చేస్తున్నారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఆయన భోళా శంకరుడు కాబట్టి అవేమీ పట్టించుకోడు. కానీ చిరు అభిమానులు ఈ నెగటివ్ బ్యాచ్ చేసే ప్రచారానికి ఫైర్ అవుతున్నారు. తిరిగి వాళ్లకి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.
నిజం చెప్పాలంటే చిరంజీవికి ఉన్న హుందాతనంలో మిగిలిన హీరోలకు చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది స్టేజ్ మీద బూతులు మాట్లాడిన సందర్భంగా కూడా ఉంది. అయితే అవేమీ కనిపించవు, ఆ విషయాల్లో మేము గుడ్డి వాళ్ళం అన్నట్టు ఈ బ్యాచ్ అంతా వ్యవహరిస్తుంది. కేవలం చిరంజీవి మీద పడే ఏడుస్తూ ఉంటారు. చిరంజీవి అంటే ఒక శిఖరం. శిఖరాన్ని చూసి శునకం మొరిగితే శిఖరానికి ఏమైనా పోతుందా.ఇది అంతే….!
Also Read:50 ఏళ్ల రచనా ప్రస్థానం… కానీ ఒక్క ఫోటో కూడా లేదు..! ఇంతకీ ఎవరాయన..?