50 ఏళ్ల రచనా ప్రస్థానం… కానీ ఒక్క ఫోటో కూడా లేదు..! ఇంతకీ ఎవరాయన..?

50 ఏళ్ల రచనా ప్రస్థానం… కానీ ఒక్క ఫోటో కూడా లేదు..! ఇంతకీ ఎవరాయన..?

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవరైనా ఏదైనా ఒక పని చేసి సక్సెస్ అయితే ఆయన గురించి ప్రపంచం మొత్తం మారు మోగిపోతూ ఉంటుంది. ఆయన ఫోటోలు, ఆయన మాటలు ప్రతిచోట కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. అలాంటిది 50 సంవత్సరాలుగా రైటర్ గా కొనసాగుతూ ఎన్నో నవలలు, కథలు, చిత్రాలకి పనిచేసిన ఒక రచయిత ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు అంటే ఎవరైనా నమ్ముతారా…

Video Advertisement

ఇది అసలు సాధ్యమేనా ? నమ్మసక్యంగా లేదు కదా… కానీ మీరు విన్నది నిజమే… ఆ రైటర్ కి సంబంధించిన రచనలు, నవలలు, మాటలు ఉన్నాయి కానీ, ఆయన ఫోటో మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు… ఆ రచయిత ఎవరు అనుకుంటున్నారా…? ఎవరో కాదు… మల్లాది వెంకటకృష్ణమూర్తి…

malladi ఈ పేరు వినగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది. ఆయన రచనలు గుర్తు వస్తాయి. ఆయన రాసిన నవలలు కవర్ పేజీలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆయన రచనల్లోని పాత్రలు మనకి తడుతూ ఉంటాయి. 106 నవలలు, 3500 కథలు,1200 వ్యాసాలు, 22 సినిమాలు,9 టీవీ సీరియల్స్ ఇది 50 ఏళ్ల సాహిత్య యాత్రలో మల్లాది కృష్ణమూర్తి సాధించిన ఘనత. ఏ జోనర్ టచ్ చేయని ఆయన అందులో సూపర్ హిట్ అవుతారు. యువతరానికి, నవతరానికి , ఏ తరానికి అయినా సరే ఆయన రచనలు కిక్ ఇస్తాయి. ఆయన పెన్ కి ఏ భేదం లేదు.1970 ఆగస్టు 3 చందమామ మాస పత్రికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి కథ ఉపాయశాలీ ప్రచురితమైంది.నాటి నుండి నేటి వరకు ఆయన రచనా ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతుంది.

ఆయన రాసిన 106 నవలల్లో 22 నవలలు సినిమాలుగా రూపొందించారు.చంటబ్బాయ్, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ ఇలా ఎన్నో మంచి సినిమాలకు మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవలలే ఆధారం. 9 టీవీ సీరి యల్స్ ను అయన నవలల ఆధారంగానే రూపొందించారు. హాస్యం, రొమాన్స్, సస్పెన్స్, క్రైమ్ ఇలా ప్రతీది కూడా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి తరం నుండి నేటి తరం వరకు ఎందరో రచయితలకు మల్లాది ఒక ఇన్స్పిరేషన్. మల్లాది డబ్బుకి, కీర్తి ప్రతిష్టలకి ఏనాడు విలువ ఇవ్వలేదు. అందుకే ఇప్పటివరకు ఎన్ని రచనలు చేసినా కూడా ఆయన ఫోటో ఒకటి కూడా బయటికి రాలేదు, ఏ పేపర్ లోను పడలేదు.ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. ప్రస్తుతం మల్లాది వెంకటకృష్ణమూర్తి రచనలు చేస్తూనే ఆధ్యాత్మిక మార్గం వైపు పయనిస్తున్నారు.

Also Read:లియో OTT లోకి ఎప్పుడంటే…..!!!!


End of Article

You may also like