ఈ రోజుల్లో ఒక్కరు రెస్టారెంట్ వెళ్ళిన తినడానికి కనీసం రూ.వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఫుడ్ బిల్లుకు తోడుగా అదనపు ట్యాక్సులు కూడా ఉంటాయి. అయితే 1985 డిసెంబర్ 20 నాటి బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా ఇంట్లో చేసిన ఫుడ్ కి రుచి,ఆరోగ్యం కూడా. కానీ ఈ మధ్య కాలంలో బయట తినడానికే అందరు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. జాబ్ టెన్షన్ వల్ల కావచ్చు, ఇతర పనుల వల్ల రెస్టారెంట్లలో తినేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు.
Also Read: Today Rashi Phalalu 2023: జనవరి 20 రాశి ఫలాలు.. మీరు చేసిన ప్రయత్నాల్లో సక్సెస్ సాధించవచ్చు..!
ఇంకొందరు ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు రెస్టారెంట్స్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. వేలకు వేలు బిల్లులు అయినా కూడా కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. కాగా, డిల్లీలోని లజపత్ నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లును చూసిన వారు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, అది ఒక రెస్టారెంట్ బిల్లు, అందులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖనీ,షాహిపన్నీర్, రైతా మరియు కొన్ని చపాతీలు ఆర్డర్ చేసారు. అయితే మొదటి రెండు వంటకాలకు(దాల్ మఖనీ, షాహిపన్నీర్) 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు. ఆశ్చర్యానికి గురి చేసేటు వంటి విషయం మొత్తం బిల్లు కేవలం 26 రూపాయలు. అంటే అప్పట్లో బిల్లులు చాలా తక్కువ. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక చిప్స్ ప్యాకెట్ రేటుకి సమానం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరలయ్యింది.
ఈ పోస్ట్ షేర్ చేసినప్పటి నుండి 1,800 లైక్లు, 587 షేర్లు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు బిల్లు చూసి అవాక్కయ్యారు. “OMG.. అది చాలా చౌకగా ఉంది. అయితే ఆ రోజుల్లో డబ్బు విలువ చాలా ఎక్కువ” అని కొందరు కామెంట్ చేస్తున్నారు.అయితే చాలా మంది నెటిజన్లు ఈ పోస్ట్ చూసి “ఒరి దేవుడా అది చాలా తక్కువ బిల్లు” ఈరోజుల్లో చిప్స్ ప్యాకెట్ కూడా రాదని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కొన్నేళ్ల క్రితం పాత బిల్లులు చూసినపుడు, నవ్వు రావడంతో పాటు మరికొన్ని సందర్భాలలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది.