Today Rashi Phalalu 2023ఈ రోజు రాశి ఫలాలు  2023 మీరు చేసిన ప్రయత్నాల్లో సక్సెస్ సాధించవచ్చు..! మీరు గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఈరోజు సరైన దిశలో వెళ్లేందుకు మంచి అవకాశాలు లభించే ఛాన్స్ ఉంది.. ఎవరైనా అనవసరంగా విమర్శిస్తే పట్టించుకోకండి. మీ ఆఫీసులకు సంబంధించిన పనులను సరిగ్గా గుర్తు పెట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Video Advertisement

horoscope today telugu

horoscope today telugu

Today Rashi Phalalu  Horoscope Today in Telugu 20.01.2023

మేష‌రాశి 2023 ఫలాలు

గ‌తంలో చేసిన‌ పనులకు ఈరోజు అభినంద‌న‌లు లభించే అవ‌కాశం ఉంది. ఎవ‌రైనా మిమ్మ‌ల్ని విమ‌ర్శలు చేస్తే ప‌ట్టించుకోకండి. మీ ఆఫీస్‌లో ర్యాండమ్ త‌నిఖీలు ఉండొచ్చు.

వృషభ రాశి 2023 ఫలాలు

: ఈరోజు ప్ర‌ణాళిక‌లు వేసుకోండి. ప్ర‌యాణ ప్ర‌ణాళిక‌లు నెల మ‌ధ్య‌లో వ‌చ్చేట్టు చూసుకోండి. భ‌విష్య‌త్తులో ప్ర‌ణాళిక‌లు మంచిగా ఉండే సూచ‌న‌లు ఉన్నాయి. ఆగిపోయిన న‌గ‌దు నిల్వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్నది. అదృష్ట సంకేతం- ఉసిరికాయ‌లు.

మిథున రాశి 2023 ఫలాలు

: ఈ రాశి వారు ఈ రోజును స‌ద్వినియోగం చేసుకోండి. ఏం చేయాల‌నుకుంటున్నారో చేయండి.మీ బంధువుకు మీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అవ‌స‌రం కావ‌చ్చు. మీరు సాయంత్రం ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. అదృష్ట చిహ్నం – వెండి తీగ

Rasi Phalalu: క‌ర్కాట‌క రాశి 2023 ఫలాలు

ఈరోజు మీరు మీ కోసం షాపింగ్ ప్లాన్ లోనే గడుపుతారు. గడువు పూర్త‌య్యే లోపు చేయాల్సిన ప‌నులన్ని పూర్తి చేయండి. ఇంట్లో నుండి స‌హ‌కారం అంద‌క‌పోవ‌డం వ‌ల్ల సాధార‌ణ ప‌నిలో ఆటంకాలు క‌ల‌గొచ్చు. అదృష్ట చిహ్నం – క‌ళాత్మ‌కంగా రూపొందించిన లోహ వ‌స్తువు

సింహ రాశి ఫలాలు  2023

ఈ రోజు టీమ్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టండి. స‌హోద్యోగుల‌తో వాద‌న మీకు ప్ర‌తికూలంగా మార్చుతుంది. ముందుగా విష‌యాల‌ను అంచ‌నా వేయ‌కండి. అదృష్ట చిహ్నం – రంగు బాటిల్

క‌న్య రాశి: ఈ రోజు మీకు కష్టమైనా ఎవ‌రినైనా సంతోష పెట్టాల్సిన అవ‌స‌రం ఉంటే దానికి కావాల్సిన ప‌నిని చేయండి. స్వ‌ల్ప‌కాలిక ప్ర‌ణాళిక‌లు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. ఈరోజు అతిథుల‌ను ఆహ్వానించే అవ‌కాశం ఉంది. అదృష్ట చిహ్నం- చెక్క పెట్టె.

Today Rashi Phalalu 2023 తులా రాశి

మీ కుటుంబంతో కొంత సమ‌యం గ‌డ‌ప‌డానికి ఈరోజు మంచి రోజు. ప‌నిలో డిమాండ్ ఉండ‌వ‌చ్చు. ఆఫీస్‌లో మీరు ఇచ్చే సూచనలు ప‌రిగ‌ణలోకి తీసుకుంటారు. ఒత్తిడి మిమ్మ‌ల్ని అల‌సిపోయేలా చేస్తుంది. అదృష్ట చిహ్నం – పెయింటింగ్

వృశ్చిక రాశి: ఈరోజు మీరు మీ పాత అలవాట్లను ఎప్ప‌టికీ వ‌ద‌ల‌నని ప్ర‌తిజ్ఞ చేసుకోండి. పాత అభిరుచిని ప్రారంభించాల్సిన టైమ్ ఆస‌న్న‌మైంది. ఈ రోజు నీర‌సంగా ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా నెమ్మ‌దిగా పూర్తిచేస్తారు. లక్కీ సైన్ – ఐస్ క్రీం.

ధ‌నస్సు: విదేశాల నుంచి వ‌చ్చే కాల్స్ మీ భవిష్యత్తు మార్చే అవ‌కాశం ఉంది. మీరు దానిని ప్ర‌త్యేకంగా భావిస్తారు. ఒక చిన్న గెట్ వే ప్లాన్ వ‌ర్కౌట్ అవొచ్చు. కొన్ని విష‌యాల్లో మీ ప్ర‌స్తుత బంధానికి కొన్ని త‌క్ష‌ణ స‌మాధానాలు అవ‌స‌రం కావ‌చ్చు. లక్కీ సైన్ – బాల్

మ‌క‌ర రాశి: మీ హెల్త్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఇది మంచి రోజు. ఈ విధంగా చేయ‌డానికి మీకు బుక్‌ లేదా ఆర్టిక‌ల్ స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంది. మీరు పోగొట్టుకున్నది. ఈరోజు దొరికే అవ‌కాశం ఉంది. అదృష్ట సంకేతం – ఈగ‌.

RASI-PHALALU-TODAY-2023

RASI-PHALALU-TODAY-2023

కుంభ రాశి: మీరు ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారో దాని గురించి ఈరోజు చేసే అవకాశం ఉంది. మీ ప్ర‌తికూల భావోద్వేగాల‌ను కాస్త ప‌రిశీలించుకోండి. ఈరోజు కొంచెం మిశ్ర‌మ ఫ‌లితాలు ఉండొచ్చు. అదృష్ట చిహ్నం – మంచు బిందువులు.

మీన రాశి: బ‌య‌టి వ్య‌క్తి నుండి స‌కాలంలో అందిన స‌ల‌హా వ‌ల్ల చాలా స‌మ‌యాన్ని ఆదా చేసుకుంటారు. మీరు ఇప్పుడు న‌మ్మ‌కంగానే ఉంటారు. పెండింగ్‌లో ఉన్నటువంటి నిర్ణ‌యాన్ని ఈరోజు తీసుకోగ‌లిగే అవ‌కాశం ఉంది. స్నేహితులు, అదృష్ట చిహ్నం – ఒక సరస్సు.