మంగళవారం పుడితే ఏం జరుగుతుందో తెలుసా..? వారి జీవితం ఎలా ఉంటుంది అంటే..?

మంగళవారం పుడితే ఏం జరుగుతుందో తెలుసా..? వారి జీవితం ఎలా ఉంటుంది అంటే..?

by kavitha

Ads

మనిషి యొక్క భవిష్యత్ ను, వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తి  పుట్టిన తేదీ, సమయం, ప్రాంతాన్ని బట్టి అంచనా వేస్తుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో జన్మించిన వారంను బట్టి కూడా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, స్వభావాన్ని గురించి చెబుతారు.

Video Advertisement

అంటే పుట్టిన వ్యక్తి వారం ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చెబుతారు. అయితే మంగళవారం రోజున జన్మించిన  వ్యక్తుల యొక్క స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వారంలో మూడవ రోజు అయిన మంగళవారంకు అధిపతి అంగారక గ్రహం. ఈ గ్రహం భూమికి దగ్గరగా  ఉంటుంది.  అందువల్ల ఆ గ్రహ ప్రభావం మంగళవారం పుట్టిన వ్యక్తుల పై ఎక్కువ ఉంటుంది. మంగళవారం పుట్టడం గొప్ప వరమని చెబుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వరంగా చెబుతారు. పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రోజున పుట్టినవారు గొప్ప మేధస్సు కలిగి ఉంటారు. ఈ రోజున ఆగొప్ప వ్యక్తిత్వం కలవారు పుడతారు. గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు మంగళవారం నాడు పుడుతుంటారు.
మంగళవారం జన్మించినవారు తమ గురిచి తాము ఆలోచిందడం కన్నా, ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తుంటారు. మంగళవారం జన్మించిన వారికి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంపాదించడం మొదలు పెట్టిన చిన్న వయసులోనే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు.మంగళవారం పుట్టిన మేష, వృచ్చిక లగ్నాల వారు అయితే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అడ్మినిస్ట్రేటివ్ గొప్పగా ఉంటారు. వారిలో  తప్పులు వెతికినా దొరకవు. అంటే వారు ఒక్క తప్పు కూడా చేయకుండా ప్లాన్ చేసుకోగల శక్తి మంగళవారం పుట్టిన వారికి ఉంటుంది. వీరికి అన్ని రంగాల గురించి చెప్పగల జ్ఞానం కలిగి ఉంటారు. ద్వేషించేవారికి కూడా పరిష్కారం చెప్పగలరు. అయితే వీరిది పై చేయిగా ఉండే తత్వం, ఎవరైనా తక్కువగా చూస్తే బాధపడతారు. నువ్వు గొప్ప అంటే మాత్రం ఎంత కష్టమైన పని అయిన చేస్తారు.కుటుంబంలో మంగళవారం పుట్టిన వారి మనసు బాధ పడితే ఆ కుటుంబం కూడా సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు. కుటుంబ యజమాని కానీ, భార్య కానీ మంగళవారం జన్మించిన వారైతే వారి మనస్సును బాధపెట్టకుండా, ఎంత బాగా చూసుకోగలిగితే ఆ కుటుంబం అంత వృద్దిచెందుతుంది. పది మందికి అన్నం పెట్టగల శక్తి ఆ కుటుంబానికి వస్తుంది. మంగళవారం పుట్టినవారు ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి ఆరాధన చేయాలి. మంగళ వారం పుట్టిన స్త్రీలు ఎంత శాంతంగా ఉంటే ఆ కుటుంబం అంత వృద్దిలోకి వస్తుంది. అమ్మవారి శ్లోకం పఠించాలి.

Also Read: మూలా నక్షత్రంలో పుట్టిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదా..? చేసుకుంటే ఏమవుతుంది అంటే..?


End of Article

You may also like